సినిమా: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
నటీనటులు: అలీ, నరేష్, పవిత్ర లోకేష్ తదితరులు
నిర్మాణ సంస్థ: అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : కొనతాల మోహన్ , అలీ, శ్రీ చరణ్ .ఆర్.
రచన, దర్శకత్వం: శ్రీపురం కిరణ్
సినిమాటోగ్రఫీ : ఎస్. మురళి మోహన్ రెడ్డి
సంగీతం : రాకేశ్ పళిడమ్
పాటలు : భాస్కరభట్ల రవికుమార్
ఎడిటర్ : సెల్వకుమార్
ప్రముఖ హాస్యనటుడు అయిన అలీ అందరికీ సుపరిచితుడే. సినిమాల్లో చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకున్న అలీ ఇటీవల ఎఫ్3 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాతో కనిపించాడు. అంతవరకు గ్యాప్ తీసుకున్న అలీ తర్వాత రెండు సినిమాల్లో కనిపించగా.. ఈ సినిమాలో హీరోగా విభిన్నమైన పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమా అలీకి ఎంత పేరు తెచ్చిపెట్టనున్నదో చూడాలి.
కథ: ఈ సినిమాలో అలీ.. మొహమ్మద్ సమీర్ అనే పాత్రలో కనిపించాడు. అలాగే ప్రముఖ నటుడు నరేష్.. శ్రీనివాసరావు పాత్రలు కనిపించాడు. ఇక నటి పవిత్ర లోకేష్.. సునీత పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా మొదటిగా శ్రీనివాసరావు, సునీత ఇద్దరి దాంపత్య బంధం మీద మొదలవుతుంది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా మద్య వయసులో కూడా చాలా ఆనందంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. తమ పిల్లలతో ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితం కొనసాగుతున్న సమయంలో.. ఓ సంఘటన జరుగుతుంది. అయితే ఓ ఫోటో ద్వారా వాళ్ల కుటుంబం చెల్లాచెదురు అయిపోతుంది. అయితే ఆ ఫోటో తీసింది.. మరెవరో కాదు మొహమ్మద్ సమీర్. అయితే మహమ్మద్ సమీర్ కు ఫోటోలు తీయడం, సెల్ఫీలు తీయడం అంటే పిచ్చి. ఫారిన్ నుంచి తిరిగి రావడం తో అతనికి ఎప్పుడు సెల్ఫీలు దిగడం ఇతరులకు ఫోటోలు తీయడం అంటే ఇష్టం. ఇలా అతను తీసిన ఫోటో ద్వారా మహమ్మద్ సమీర్ చిక్కుల్లో పడతాడు. అలాగే దానివల్ల శ్రీనివాసరావు, సునీత కుటుంబం చిక్కుల్లో పడుతుంది. అలాగే మొహమ్మద్ సమీర్ రూబా తో ప్రేమలో పడతాడు. వీళ్ళ ప్రేమ విషయం ఏమైంది? అయితే ఆ ఫోటో లో ఏముంది? ఆ ఫోటోకు శ్రీనివాసరావు కుటుంబానికి మధ్య సంబంధం ఏమిటి? అలీ ఆ ఫోటోను ఎందుకు తీశాడు? అన్నదే మిగతా కథ.
నటీనటుల పనితీరు: మహమ్మద్ సమీర్ గా అలీ బాగా నటించాడు. హాస్యనటుడైన అలీ మళ్లీ హీరోగా అందరిని మెప్పించాడు. ఇక పవిత్ర లోకేష్, నరేష్ కూడా తమ మధ్య కెమిస్ట్రీని బాగా పండించారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీతో ఎమోషనల్ సీన్ లు బాగా వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు ఎవరి పాత్రలో వాళ్ళు బాగా నటించి.. అన్ని పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ: ఒక మలయాళ కథను తెలుగు ప్రేక్షకుల దగ్గరగా తీసుకొచ్చి ప్రేక్షకులను బాగా మెప్పించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఈ సినిమాలో ఎక్కడ రీమేక్ అన్న భావన కలుగకుండా చిత్రీకరించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా కనిపిస్తుంది. మలయాళ చిత్రం వికృతి అయినా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా అనిపిస్తుంది.
అలాగే నిజ జీవిత పాత్రను మనం దగ్గర నుండి చూస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అలాగే ఈ కథలోని సెన్సిటివ్ ఎమోషన్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా ఇందులో ఎమోషనల్ కంటెంట్ తో సాగే కథలో మెయిన్ ప్లాట్ డిస్టర్బ్ కాకుండా దానికి కామెడీని జోడించి సినిమాను బాగా ముందుకు తీసుకెళ్లారు డైరెక్టర్.
అలాగే కథలో అలీ హీరోగా చాలా బాగా నటించాడు. అలీ సినిమాలు చూడటానికి అందరూ ఇష్టపడతారు. అలాగే నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ప్రేమ బాధన ప్రేక్షకులు ను అట్రాక్ట్ చేసుకునేలా ఉంది. కథ ఎక్కడ కూడా లాగ్ అవుతున్నట్టు కనిపించలేదు. అలాగే ఈ సినిమాలో ఓ మనిషి సోషల్ మీడియా ద్వారా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు అనే కోణాన్ని వాస్తవంగా చూపించడం చాలా బాగా ఆకట్టుకుంది.
దీంతో ప్రస్తుత యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. డైరెక్టర్ అదేవిధంగా యువతను ఆకట్టుకొని సక్సెస్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన డిజైన్ చాలా బాగుంది. ఇక మలయాళం లో సూపర్ హిట్ అయినా ఒరిజినల్ మూవీ వికృతి కంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి..
అనే ఈ సినిమా ఓ మెట్టు పైనే ఉంది. ఇక సినిమా చివరికి వచ్చేసరికి క్లైమాక్స్లో పాత్రలకు ఏం జరుగుతుందో అని ఉత్సగతను దర్శకుడు బాగా మెయింటైన్ చేశాడు. ఇక క్లైమాక్స్ సమయంలో సినిమా మీద అందరికీ భావోద్వేగం కూడుకున్న అనుభూతి కలుగుతుంది. ఇక చివరిదాకా ఏం జరుగుతుందో.. అలీ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నా ఆసక్తి అందరిలో కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్: అలీ నటన, నరేష్, పవిత్ర ల మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్, సంగీతం
మైనస్ పాయింట్స్: కొన్ని ఫ్యామిలీ ఎపిసోడ్స్
రేటింగ్: 3/ 5