ప్రస్తుతం బుల్లి తెర యాంకర్స్ గా అలరిస్తున్న వారికి మూవీస్ లో మంచి పాత్రలు వస్తున్నాయి.వాటిని సద్వినియోగం చేసుకుంటున్న యాంకర్స్ కు బ్యాక్ టు బ్యాక్ మూవీ అవకాశాలు వద్దన్నా వస్తున్నాయి.వారి లిస్ట్ చాలా పెద్దదే ఉంది అందులో మెగాస్టార్ సరసన అవకాశం కొట్టేసిన ఇద్దరు ముద్దగుమ్మలు గురించి ఇప్పుడు చూద్దాం.జబర్దస్త్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మి,అనసూయకు హీరోయిన్స్ గా కూడా అవకాశాలు వచ్చాయి వాటిని వినియోగించుకున్న వెండితెర ప్రేక్షకులకు బాగా దగ్గరవ్వాలని ప్రయత్నించిన ఈ హాట్ యాంకర్స్ కు వెండితెర ప్రేక్షకులు గట్టి షాక్ ఇచ్చారు దీంతో వాళ్ళ రూట్ మార్చుకున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సెలెక్టివ్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టారు.దీంతో వీరిద్దరికీ మరింత గుర్తింపు వచ్చింది.కానీ అనసూయలా అనర్గళంగా స్పష్టంగా తెలుగు మాట్లాడడం రాకపోవడంతో రష్మీ గౌతమ్ అనసూయ కొచ్చినన్ని అవకాశాలు అందుకోలేకపోయింది.దీంతో చాలాకాలం నుండి మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఆమెకు తాజాగా మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న భోళా శంకర్ తో మంచి అవకాశం లభించింది.మరి ఆ అవకాశం ఆమె కోరుకుంటున్న బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
బుల్లితెర ప్రేక్షకులను తన అందంతో తన మాటలతో తో ఆకటుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర మీద స్టార్ డం ను ఎంజాయ్ చేస్తుంది.బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి ప్రేక్షకులకు మరింత దగ్గరయిన ఈ ముద్దుగుమ్మ,ఆ షో నుండి బయటకి వచ్చాక ఆ షోలోని మిగతా వాళ్ళలాగా అవకాశాలను అందిపుచ్చుకొలేక డిలా పడిపోయింది. అడపాదడపా సినిమాలలో నటిస్తున్న ఆమెకు ఆ చిత్రాలు పెద్ద బ్రేక్ ఇవ్వట్లేదు.దీంతో ప్రస్తుతం యాంకరింగ్ పై మాత్రమే దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా మెగాస్టార్ భోళా శంకర్ లో అవకాశం దక్కింది.మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈమెకు అన్నయ్య మూవీ ఏ మేర హెల్ప్ చేస్తుందో వేచి చూడాలి.