Anchor Syamala: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్లుగా గుర్తింపు పొందిన వారిలో శ్యామల కూడా ఒకరు. మొదట సీరియల్ నటిగా తన కెరీర్ ప్రారంభించిన శ్యామల ఆ తరువాత యాంకర్ గా మారింది. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందింది. అయితే చాలా కాలంగా శ్యామల టీవీ షోస్ లో కనిపించకపోయినా కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సెలబ్రిటీల ఇంటర్వ్యూలలో సందడి చేస్తూ బిజీగా ఉంది.
అంతేకాకుండా టెలివిజన్ లో ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా శ్యామల చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను వీడియోల రూపంలో తన అభిమానులతో పంచుకుంటుంది.
యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన శ్యామల వ్యక్తిగత విషయాల గురించి కూడా అందరికీ తెలుసు. నరసింహారెడ్డి అనే నటుడిని శ్యామల ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.
అయితే శ్యామల నరసింహారెడ్డిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. అందువల్ల ఘనంగా పెళ్లి చేసుకోలేక పోయింది. దీంతో పెళ్లి కూతురిగా ముస్తబయ్యి పల్లకిలో వచ్చే అవకాశాన్నీ కూడా మిస్ అయ్యిందీ. అయితే పెళ్ళైన ఇంత కాలానికి శ్యామల తన కోరిక నెరవేర్చుకుంది.
Anchor Syamala: ఇప్పటికీ ఆ కోరిక తీరింది..
ఇటీవల శ్యామల పెళ్ళి కూతురిలా అందంగా ముస్తాబై పల్లకిలో ఊరేగింపు గా వెళ్ళింది. దీనికి సంబందించిన వీడియోని శ్యామల తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ పెళ్లి నాటి కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె పెళ్లిలో తీరని కోరికను ఇలా తీర్చుకోవడమే కాకుండా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున నేటిజన్లో ఈ వీడియో పై స్పందిస్తూ తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.