Bigg Boss 6: ఓటిటి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శివ టాప్ ఫైవ్ లో ఉండటం తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ శివ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వారిని ఇంటర్వ్యూలు చేసి వాళ్లతో కామెడీ చేపిస్తూ.. గుర్తింపు తెచ్చుకున్న శివ.. బిగ్ బాస్ హౌస్ లో అడిగు పెట్టాక మరింత క్రేజ్ సంపాదించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ సిక్స్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ సిక్స్ లో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ శివ రెడీ అయినట్టు సమాచారం.
బిగ్ బాస్ బాజ్ లో ఈ ఇంటర్వ్యూలు ప్రసారమవుతూ ఉంటాయి. గతంలో రాహుల్ సిప్లిగంజ్, తనీష్, అరియనా హౌస్ నుండి ప్రతివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేస్తూ వచ్చారు. అయితే సీజన్ సిక్స్ కి సంబంధించి యాంకర్ శివ… ప్రతివారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయనుడటా. మొదటివారం సీజన్ 6లో నో ఎలిమినేషన్ ఉండటంతో రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది.
రెండో వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు రేవంత్, ఫైమా, మేరీనా రోహిత్, ఆదిరెడ్డి, గీతు రాయల్, అభినయశ్రీ, రాజ్, షానీ ఉండటం జరిగింది. వీరిలో రాజ్ ఈవారం కెప్టెన్ అయ్యాడు. మిగతా ఓటింగ్ పరంగా చూసుకుంటే రేవంత్, ఫైమా, మేరీనా రోహిత్, ఆదిరెడ్డి, గీతు రాయల్ మొదటి స్థానంలో ఉన్నారు. ఇంకా మిగిలిన అభినయశ్రీ, షానీల మధ్య పోటి ఉన్నట్లు, వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని వార్తలు వస్తున్నాయి.