ఫిమేల్ యాంకర్స్ రాజ్యమేలుతున్న తెలుగులో ప్రదీప్ మాచిరాజ్ తో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ రవి.కెరియర్ లో కాంట్రవర్సీ లకు దూరంగా ఉంటూ వచ్చిన రవి కరోనా ముందు బ్యాక్ టు బ్యాక్ కాంట్రవర్సీ లలో ఇరుక్కొని అగచాట్లు పడ్డాడు. ఆతర్వాత వాటి అన్నిటి నుండి కోలుకొని కెరియర్ లో బౌన్స్ అయిన రవి తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించి ప్రేక్షకులను అలరించారు.తాన స్ట్రాటజిలతో హౌస్ మేట్స్ ను ఒక ఆట ఆడకున్న రవి టాప్ 5 లో ఒకరని అందరూ భావించారు కానీ అకస్మాత్ గా బిగ్ బాస్ కొత్త ఎత్తు వేసి రవిని హౌస్ నుండి బయటకు పంపారు.
ఈ చర్య పట్ల ఆగ్రహించిన రవి అభిమానులు రవికి అన్యాయం జరిగిందని ఆయన్ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని ఆవేదనను వ్యక్తం చేశారు.ఈ సమయంలో రవి మళ్ళీ హౌస్ లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.టాప్ 5 లో అమ్మాయిని ఉంచడం కొసమే రవిని బిగ్ బాస్ యాజమాన్యం ఎలిమినేట్ చేసిందని చాలామంది నమ్ముతున్నారు ఇందులో నిజం లేకపోలేదు.హౌస్ నుండి బయటికి వచ్చిన రవి కొందరు నెటిజన్లు హౌస్ గురించి, హౌస్‌మేట్స్ గురించి నెగిటివ్‌గా మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ లను కూడా టార్గెట్ చేస్తున్న వారికి మారండి అని వార్నింగ్ ఇచ్చాడు అయిన వారు మరకపోవడంతో తాజాగా ఇలా సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా ఇతరులను వారి కుటుంబాలను దూషిస్తున్న వారిపై కేసు నమోదు చేశాడు.ఈ విషయంపై మాట్లాడిన రవి సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో తప్పు మాట మాట్లాడాలన్నా,దాన్ని టైప్ చేయాలన్న పోకిరిలకి భయం పుట్టాలని కామెంట్ చేశాడు.