Anchor Rashmi: టీవీ షోలతో ప్రతి ఇంటికి చేరువైన జంటల్లో ఫేమస్ జంట.. సుధీర్ – రష్మీ. వీరి పర్ఫామెన్స్ కి వీల్లకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక జబర్దస్త్ యాంకర్ గా రష్మీ.. జబర్దస్త్ కమెడియన్ గా సుధీర్ చాలా సక్సెస్ సాధించారు. వీరిద్దరినీ కలిపి తీసే ఏ షో అయినా సూపర్ హిట్టే. వీరిద్దరి రొమాన్స్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ ఛానళ్ల లో చేసే ఢీ షో లో వీరి ప్రదర్శన తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది.
యూట్యూబ్ జంటగా ఫేమస్..
ప్రతి తెలుగింటికి చేరువైన ఈ జంట విపరీతమైన క్రేజ్ పొందింది. ఈ క్రమంలో వీళ్లకు కొంతమంది “యూట్యూబ్ జంట” అని ముద్ర వేశారు. ఇక ఈ క్రేజ్ తో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. బుల్లితెర పై మంచి హిట్స్ అందుకున్న ఈ జంట త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ విషయమై తాజాగా.. సుధీర్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివరించాడు.
సుధీర్ నటించిన “గాలోడు” సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో సుధీర్ కొన్ని పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. “నాకు రష్మీకి మధ్య ఏమి లేదు కానీ మా మధ్యలో ఏదో ఉందంటూ క్రియేట్ చేస్తున్నారు. రేపటి రోజు రష్మీకి పెళ్లయితే నా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో తల్చుకుంటుంటే భయమేస్తుంది ..నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను” అని వాపోయాడు.
Anchor Rashmi:
ఇక ఈ ప్రకటనతో వీళ్లిద్దరి మధ్య ఏమి లేదని, వీరు పెళ్లి చేసుకోరని ఫాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇక కొందరు ఫాన్స్ ఏమో రష్మీ వేరే వారిని పెళ్లి చేసుకుంటే ఊరుకోమని మండిపడుతున్నారు. ఇక వీరి పెళ్లి విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సుధీర్ “గాలోడు” సినిమా నేడే విడుదల అయ్యింది.