Anchor Rashmi: తెలుగు బుల్లితెరపై ఎంతోమంది టాలెంటెడ్ గ్లామరస్ యాంకర్స్ ఉన్నారు.ఇలా తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లుగా కొనసాగుతూ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో యాంకర్లుగా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై నటిస్తూ ఎంతో సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు.ప్రస్తుతం ఈమె వరస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇదే రేంజ్ పాపులారిటీ ఉన్నవారిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు.
బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా వారానికి మూడు రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.చూడ చక్కని అందం ఎంతో టాలెంట్ ఉన్నటువంటి రష్మీ బుల్లితెరపై ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా అదృష్టం కలిసి రాలేదు.
ఇలా వెండితెరపై తనకు సక్సెస్ రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ బుల్లితెరపై మంచి సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలోనే వెండితెరకు దూరంగా ఉన్నటువంటి రష్మీ బుల్లితెర వరుస కార్యక్రమాలను చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. వెండితెరపై ఈమె నటించిన రెండు మూడు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో వెండితెరపై ఎలాగో స్టార్ హీరోయిన్ స్టేటస్ రాదు. అందుకే బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఈమె ఎక్కువగా బుల్లితెరపై సందడి చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Anchor Rashmi: బుల్లితెరపై సక్సెస్ సాధించిన రష్మీ..
ఇలా తనకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చిన బుల్లితెర కార్యక్రమాలు తన కెరీర్ ను ఈ స్థాయిలో నిలబెట్టాయని భావించిన రష్మి బుల్లితెరకి పరిమితమయ్యారు.అయితే వెండి తెరపై కూడా నటించే అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని అయితే బుల్లితెర కార్యక్రమాలను మాత్రం వదిలిపెట్టనంటూ రష్మీ ఎన్నోసార్లు చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటించే అవకాశం అందుకున్నారని తెలుస్తోంది.ఏది ఏమైనా వెండి తెరపై సక్సెస్ కాలేకపోయినా ఈ యాంకరమ్మ బుల్లితెరపైనే కొనసాగడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.