
Anchor Manjusha : హీరో హీరోయిన్ లే కాదు ఈ మధ్య వారిని ఇంటర్వ్యూ చేసే యాంకర్ లు కూడా సెలెబ్రిటీ లు అయిపోతున్నారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ప్రముఖ యాంకర్ మంజూష కూడా తానేమీ తక్కువ కానంటూ స్టార్ లను తలదన్నేలా అదిరిపోయే ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా మంజూష ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకు సందడి చేసింది.

లాంగ్ ఫ్రాక్ తో భిన్నమైన యాంగిల్స్ లో ఫోటో లు దిగి తన ఫాన్స్ ను ఇంప్రెస్ చేసింది మంజూష . ఎప్పుడు డీసెంట్ గా ఉండే ఈ సొట్టబుగ్గల భామ ఒక్కసారిగా గ్లామర్ లుక్ లో కనిపిస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు. ఈ ఫోటో షూట్ లు చూస్తే ముంబై మోడల్స్ కూడా పనికి రారని కామెంట్ లు చేస్తున్నారు
ఈ పీక్స్ ఏ కాదు గతంలోనూ తొడలు కనిపించే ల డ్రెస్ లు వేసుకుని ఫోటో లకు పోజులు ఇచ్చింది. లాక్ డౌన్ లో వర్క్ అవుట్ లు చేసి సన్నబడిన మంజు తనలోని హాట్ యాంగిల్ ను చూపిస్తోంది. అనసూయ , రష్మీ, శ్రీముఖి వంటి కుర్ర యాంకర్ లు గ్లామర్ డోస్ లు పెంచి బుల్లితెరను ఎలేస్తుంటే ..నేను సైతం అంటూ అందాల ఆరబోతకు సిద్ధం అయ్యింది మంజూష .

Anchor Manjusha : స్టార్ హీరోలను హీరోయిన్ లను ఇంటర్వ్యూ చేయాలంటే ఈమె ఉండాల్సిందే . దదాపుగా ౩౦౦౦ మందికి పైగా సెలెబ్రిటీ లను ఇంటర్వ్యూ చేసింది మంజూష . ఇప్పటికి యాంకర్ గా తన జర్నీని కొనసాగిస్తోంది. అయితే చాల మందికి మంజూష యాంకర్ గానే తెలుసు. కానీ మంజూష మంచి నటితో పాటు మోడల్ కూడా. చెల్లెలి సెంటిమెంట్ తో వచ్చిన రాఖి సినిమాలో జూనియర్ ఎన్ టీఆర్ కు అమాయకు చెల్లి గా నటించి అందరి మెప్పును పొందింది. నటిగా మంచి గుర్తింపు లభించినా ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు .