Anchor Lasya:తెలుగు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ లాస్య గురించి పరిచయం అవసరం లేదు.ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ రవితో కలిసి మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించారు. కార్యక్రమాలకు రవితో కలిసి యాంకర్ గా వ్యవహరించిన ఈమె ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇకపోతే లాస్య వివాహమైన తర్వాత పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.బిగ్ బాస్ అనంతరం ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొని సందడి చేశారు.ఇక లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అనంతరం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసింది.
ఈ క్రమంలోనే లాస్య ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే తన బిడ్డకు సంబంధించిన అన్ని విషయాలను అలాగే తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో నిత్యం అభిమానులను సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి లాస్య తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు.
Anchor Lasya: రెండు బిడ్డకు జన్మనివ్వబోతున్న లాస్య..
గత కొన్ని రోజుల క్రితం ఈమె అనారోగ్య సమస్యతో బాధపడుతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం తను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పిన లాస్య తాను మరోసారి తల్లి కాబోతున్నారనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఇలా లాస్య తన భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్న కిట్ తో పాటు,అల్ట్రా సౌండ్ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇలా తాను మరోసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని చెప్పడంతో పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రిటీలు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.