తన యాంకరింగ్ తో తెలుగు వారికి బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షోలు, సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టిిటివ్ గా ఉంటూ సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందించే అనసూయ తాజాగా టీకాలు లేని పిల్లలు స్కూల్ కు వెళ్ళే పరిస్థితి రావడంపై అలాగే స్కూల్ ఉన్నప్పుడు పిల్లలకు ఏమైనా అయితే తమకు సంబంధం లేదని స్కూల్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల దగ్గర బలవంతంగా సైన్ చేయించుకుంటున్న అంశాలపై అవేదన వ్యక్తం చేస్తూ కేటిఆర్ ను ట్యాగ్ చేస్తూ దీనిపై ఒక మార్గనిర్దేశం చేయమని కోరుతూ వరసగా ట్వీట్స్ చేస్తున్నారు.
ఇలాంటి అంశాలపై వేగంగా స్పందించే కేటిఆర్ ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి