Anasuya: అటు రంగస్థలం మూవీలో రంగమ్మ క్యారెక్టర్ తో…ఇటు బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయిన అనసూయ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆమెకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ హల్చల్ చేస్తూనే ఉంటాయి. జబర్దస్త్ షోలో అనసూయ పండించిన కామెడీ ప్రేక్షకులకు ఆమెను బాగా దగ్గర చేసింది.
ఈ క్రమంలో ఫారిన్ ట్రిప్ కి వెళ్ళిన అనసూయ పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే రీసెంట్ గా అనసూయ తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న ప్రత్యేక పూజలకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి.
సినిమాలో, ఈవెంట్స్ లో యాక్టివ్ గా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్, మూవీస్ ఇలా తనకు సంబంధించిన అన్ని వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె తన భర్త భరద్వాజ్ తో కలిసి చేసిన ప్రత్యేక పూజలు వీడియో ఇన్స్టా లో షేర్ చేసుకుంది.
ఈ వీడియోలో అనసూయ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరూ సంప్రదాయ దుస్తుల్లో ముఖానికి హరినామాలు పెట్టుకొని ఉన్నారు. పూజకు హాజరైన వేద పండితులు వేదమంత్రాలు చదువుతున్నారు. వీడియోలో పరిసరాల ప్రకారం పూజ జరుగుతున్నది ఆమె సొంత ఊరిలో కులదైవం కి అయి ఉండొచ్చు అని పలువురు భావిస్తున్నారు.
ప్రస్తుతం అనసూయ జబర్ధస్త్ కామెడీ షోకి టాటా చెప్పి తన పూర్తి ఫోకస్ ని వెండితెరపై పెట్టింది. ఒకవేళ తనకు వెండితెరపై సక్సెస్ కలగాలి అనే ఉద్దేశంతో ఏదన్నా జాతకం లాంటిది చూపించి, దానికి సంబంధించిన పూజలు ఏమన్నా చేస్తుండొచ్చు అని కూడా కొందరు భావిస్తున్నారు. తన పూజలకు సంబంధించి పలు రకాల వార్తల చక్కెరలు కొడుతున్న అనసూయ ఇంతవరకు వేటి మీద క్లారిటీ ఇవ్వలేదు.
Anasuya:
తను పోస్ట్ చేసిన వీడియోకి కేవలం ‘సర్వేజనా సుఖినోభవంతు’అన్న ఒక్క కామెంట్ మాత్రం పెట్టింది. ఏది ఎలా ఉన్నా హరినామం పెట్టుకొని, సంప్రదాయబద్ధంగా రెడీ అయిన అనసూయ ఫొటోస్ ,వీడియోస్ కు మంచి కామెంట్స్ పెడుతూ అభిమానులు బాగా వైరల్ చేసేసారు.
View this post on Instagram