సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా సినీ అభిమానులను అలరించి మెప్పించిన యాంకర్ అనసూయ ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన పుష్ప మూవీలో కూడా ఒక కీ రోల్ లో నటించింది.ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రేసులో రికార్డ్స్ వైపు దూసుకుపోతున్న ఈ మూవీలో నటించడానికి యాంకర్ అనసూయ రోజుకి 1.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు.దాదాపు వారానికి పైగా ఈ మూవీలో నటించిన యాంకర్ అనసూయ ఈ మూవీ మేకర్స్ నుండి 12 లక్షలను తీసుకుంది.
ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్ కోసం నాని శ్యామ్ సింగ్ రాయ్ మూవీతో రేపటి నుండి బాక్స్ ఆఫీస్ బరిలో తలపడనుంది.దీంతో చిత్ర యూనిట్ మూవీ కలెక్షన్స్ ను పెంచేందుకు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.అవి సఫలం అయితే కానీ ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ఈ మూవీ ఫలితం మీద సెకండ్ పార్ట్ షూటింగ్ ఆధారపడి ఉంది.