యాంకర్ గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. యాంకర్ గానే కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడుకి జబర్దస్త్ మంచి గుర్తింపు తీసుకొచ్చింది రీసెంట్ గా ఆ షో నుంచి పూర్తిగా బయటకి వచ్చింది. వచ్చిన తర్వాత జబర్దస్త్ షోలో స్కిట్స్ లో భాగంగా తనపై చాలా మంది బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవారని, వాటికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే మా ఎమోషన్స్ ని ఎడిటింగ్ లో తొలగిస్తారని కూడా చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో అనసూయ బిజీ అవుతుంది. మరో వైపు స్టార్ మా, జీతెలుగు ఛానల్స్ లో షోలు చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా లైగర్ సినిమా రిలీజ్ సందర్భంగా విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా విమర్శలు చేసింది.
లైగర్ ఫ్లాప్ అయినందుకు తన సంతోషం వ్యక్తం చేసింది. ఈ కామెంట్స్ పై రౌడీ స్టార్ ఫ్యాన్స్, అలాగే తెలుగు సినిమా అభిమానులు సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఆమె మీద విమర్శల దాడి మొదలు పెట్టారు. సినిమాల మీద బ్రతుకుతూ సినిమా పోయిందని సంతోషిస్తావా అంటూ విమర్శలు చేస్తూ నెటిజన్లు కామెంట్స్ తో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీనిపై అనసూయ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యి సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. అనసూయని ఉద్దేశించి ఆంటీ అంటూ చేసిన కామెంట్స్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు అంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో ఇండస్ట్రీలో ఎవరూ కూడా అనసూయకి అండగా నిలబడలేదు.
ఇంకా యాక్టర్ బ్రహ్మాజీ అయితే పరోక్షంగా అనసూయకి కౌంటర్లు వేశారు. ఇదిలా ఉంటే ఈ ఆంటీ ట్రోలింగ్, అలాగే లైగర్ సినిమాపై ఆమె చేసిన కామెంట్స్ దర్శకులకి సీరియస్ గా తాకాయనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఓ మూడు సినిమాల నుంచి ఆమెని తప్పించారని టాక్ వినిపిస్తుంది. అలాగే పుష్ప సీక్వెల్ లో కూడా అనసూయ రోల్ కి ఫుల్ స్టాప్ పెట్టడమో, లేదంటే వేరొక నటిని రీప్లేస్ చేయడమో చేయాలని భావిస్తున్నట్లుబోగట్టా. ఒక వేళ అనసూయని తమ సినిమాలలో కొనసాగిస్తే రౌడీ స్టార్ ఫ్యాన్స్ అలాగే పూరి జగన్నాథ్ అభిమానుల నుంచి బాయ్ కట్ ట్రోలింగ్ ఎదుర్కొనే అవకాశం ఉందనే భావనతో ముందుగానే వారు జాగ్రత్త పడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.