Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు బుల్లితెరపై యాంకర్ గా తన సత్తాను నిరూపించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుసగా అవకాశాలు అందుకుంటూ నటిగా కూడా తనంటే ఏంటో నిరూపించుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది.
అనసూయ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుండడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈమెకు అవకాశాలు అందుతున్నాయి. ఇకపోతే ఇటీవల ఈమె గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
అలాగే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతినిండా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే మొదట జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ అవకాశాలు ఎక్కువ అవ్వడంతో ఇటీవలే జబర్దస్త్ షో కి గుడ్ బాయ్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.
ఇక వెకేషన్ లో అక్కడి ప్రకృతి అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నే ఉంది. కాగా ప్రస్తుతం అనసూయ అమెరికా టూర్ లో ఉంది. అమెరికాలో అక్కడి అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ నే ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె లంగా వోని ధరించింది. అళంగా వోణీలో ఆమె ఎంతో ముద్దుగా క్యూట్‌గా అందంగా కనిపిస్తోంది.
View this post on Instagram
దీంతో అనసూయ అభిమానులు వీడియో పై ప్రశంసల వర్షం కురిపించడంతోపాటు ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అనసూయ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది అనసూయ. అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది.