Ananya Pandey : సినిమా ప్లాప్ అయితే ఏ హీరోయిన్ అయినా ఏం చేస్తుంది. కొన్నాళ్ళు మీడియాకు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకు చిక్కకుండా తిరుగుతుంది . ఎక్కడ కనిపిస్తే మూవీ గురించి అడుగుతారో అని టెన్షన్ పడుతుంది. కానీ ఈ విషయంలో లైగర్ భామ అనన్య పాండే కథే వేరు. ఈ బాలీవుడ్ బ్యూటీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ మూవీ ఇండస్ట్రీ లోనే పెద్ద డిసాస్టర్ ను మిగిల్చినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదట . ఫీల్ అవ్వడం విషయం పక్కన పెడితే వెకేషన్ కోసం ఫారెన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది .

తాజాగా ఫారెన్ ట్రిప్ లో ఉన్న అనన్య పాండే బికినీతో కొండల నడుమ దిగిన ఫోటో లను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చాలా మంది నెటిజెన్ లు ఈ పిక్స్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది హార్ట్ సింబల్స్ ని ఇన్ బాక్స్ లో పోస్ట్ చేస్తుంటే మరి కొంత మంది గ్రీన్ కలర్ బికినిలో సో హాట్ అంటూ పొగిడేస్తున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా ప్లాప్ అయినా ఇలా ఎలా ఎంజాయ్ చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు.
Ananya Pandey : ప్రతి అవుట్ ఫిట్ అప్డేటెడ్ ఫ్యాషన్ స్టైల్స్ కు దగ్గరగా ఉంటాయి
అనన్య పాండే ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్స్ అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భామ వేసుకునే ప్రతి అవుట్ ఫిట్ అప్ డేటెడ్ ఫ్యాషన్ స్టైల్స్ కు దగ్గరగా ఉంటాయి. క్యాజువల్, ఆఫ్ డ్యూటీ లుక్స్ దగ్గరి నుంచి , రెడ్ కార్పెట్ అవుట్ ఫిట్స్ వరకు ఈ భామ ఫ్యాషన్ లో కొత్తదనాన్ని చూపిస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అద్భుతమైన ఆఫ్ డ్యూటీ లుక్ లో కనిపిస్తూ అందరిని ఫిదా చేస్తోంది. లైగర్ మూవీ షూటింగ్ , ప్రమోషన్ లతో బిజీ బిజీ గా గడిపిన ఈ సుందరి సినిమా ప్లాప్ అయినా విరామం తీసుకునేందుకు వెకేషన్ కి చెక్కేసింది. అక్కడ దిగిన ఫొటోలే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.

ప్రస్తుతం అనన్య టైగర్ బాయ్ బ్యానర్ లో ఖో గయే హమ్ సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ లు ఈ మూవీ లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2023 లో విడుదల కానుందని అంచన.