Ananya Pandey : ముంబైలో జరిగిన మజా మా స్క్రీనింగ్‌కు ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌తో హాజరై అందరి చూపును తనవైపు తిప్పుకుంది లైగర్ భామ అనన్య పాండే. ఆకుపచ్చని రంగులో ప్రింటెడ్ డిజైన్స్‌తో వివిధ అలంకరణలతో వచ్చిన లెహెంగా సెట్ వేసుకుని వెడ్డింగ్ సీజన్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేసింది అనన్య. నవరాత్రి పండుగ సందర్భంగా లెహంగా సెట్ వేసుకుని పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది .

Ananya Pandey : మాధురీ దీక్షిత్ నటించిన మజా మా స్క్రీనింగ్ లో బాలీవుడ్ స్టార్‌లు సందడి చేశారు. నోరా ఫతేహి, కరణ్ జోహర్, కబీర్ ఖాన్, సుహానా ఖాన్ ఇలా చాలా మంది తారలు అద్భుతమైన అవుట్‌ఫిట్స్ ధరించి స్పెషల్ గా కనిపించారు. వీరందరిలో అనన్య పాండే మాత్రం ఎత్నిక్ వేర్‌ను ధరించి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. రానున్నది వెడ్డింగ్ సీజన్ కావడంతో ప్రముఖ డిజైనర్ డిజైన్ చేసిన అద్భుతమైన వెడ్డింగ్ లెహెంగాను వేసుకుని వెడ్డింగ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది అనన్య.

ఈ అవుట్‌ఫిట్‌కు సంబంధించిన పిక్స్‌ను అనన్య స్టైలిస్ట్ తాన్య గావ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పిక్స్ కింద ‘అండ్ ది ఫెస్టివిటీస్ బిగిన్ ‘అని క్యాప్షన్‌ను జోడించింది. డిజైనర్ అర్పితా మెహతా క్లాతింగ్ లేబుల్ నుంచి ఈ అందమైన లెహెంగా సెట్‌ను ఎన్నుకుంది అనన్య పాండే. అనన్య ధరించిన ఈ లెహెంగా సెట్ ధర రూ.91 వేలు. దీనిని అర్పితా మెహతా గ్రీన్ అండ్ సాండ్ గార్డెన్ ప్రింట్ స్కర్ట్ సెట్ అనే పేరుతో తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

లెహెంగా డిజైన్ డీటైల్స్‌ను ఒకసారి గమనిస్తే లెహంగాసెట్‌ను పూర్తి స్థాయిలో హ్యాండ్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు డిజైనర్. క్లిష్టమైన పూల కరిగారి వర్క్, యూ నెక్‌లైన్, మిడ్‌రిఫ్ బేరింగ్‌తో సీక్విన్ అలంకరణలతో బ్లౌజ్‌ను డిజైన్ చేశారు. దీనికి జోడీగా గ్రీన్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్యాట్రన్స్‌తో వచ్చిన లెహంగా స్కర్ట్‌ను అందించారు..

అనన్య మ్యాచింగ్ దుపట్టాను తన చేతుల్లో అందంగా పట్టుకుని తన ట్రెడిషనల్ లుక్‌ను కంప్లీట్ చేసింది. ఈ లెహెంగాకు నప్పే విధంగా చెవులకు బంగారపు జుంకాలను చేతి వేలికి పెద్దసైజు ఉంగారాన్ని , చేతికి బ్రేస్‌లెట్ పెట్టుకుంది. సైడ్ పాపిట తసుకుని తన కురులను లూజ్‌గా వదులుకుంది. పెదాలకు పింక్ లిప్‌స్టిక్ , కనులకు ఐ లైనర్, మస్కరా వేసుకుని గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేసింది.