మల్లేశం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ అనన్య నాగళ్ళ. ఈ అమ్మడు వకీల్ సాబ్ సినిమాలో చివరిగా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్ గా తనని తాను టాలీవుడ్ లో షో అప్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. అందానికి అందం, ఆకర్షణ ఉన్న ఈ బ్యూటీకి చిన్న చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి. అయితే సరైన బ్రేక్ ఇచ్చే చిత్రం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా అనన్య నాగళ్ళ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఓ బడా ప్రొడ్యూసర్ ఇంటికి కోడలిగా వెళ్తుందని. నిర్మాత చిన్న కొడుకుతో రిలేషన్ లో ఉందనే మాట వినిపిస్తుంది.
ఇవి అలానే నడుస్తున్న అనన్య మాత్రం రోజు రోజుకి గ్లామర్ పెంచేస్తూ మరింతగా అందాల ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ లతో సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే పెళ్లి వార్తలపై తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. తనకి వరుడిని చూసినందుకు థాంక్స్ అని సెటైరికల్ గా కామెంట్స్ చేసింది. ఆ వరుడు ఎవరనేది తనకి కొద్దిగా చెప్పాలని, నా పెళ్లికి నేను కూడా హాజరయ్యే ప్రయత్నం చేస్తానని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సెటైరికల్ గా ఉండటంతో పాటు తాను ఎవరితో రిలేషన్ లో లేననే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. అలాగే పెళ్లి వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని కూడా స్పష్టం చేసింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ కూడా ఫన్నీగానే స్పందిస్తూ ఆమెకి తిరిగి కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.