ఆనంద్ సాయి అంటే ముందుగా అందరికి గుర్తికొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి అతి కొద్ది మంది స్నేహితులలో ఆనంద్ సాయి ఒకరని చెప్పాలి. ఆర్ట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఆనంద్ సాయికి ఇండస్ట్రీకి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అనే సంగతి చాలా తక్కువ భద్రి సినిమాతో ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ ఆర్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అతను సినిమాలు బాగా తగ్గించేశారు.
దానికి కారణంగా తెలంగాణలో యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ ఆలయం నిర్మాణం అంతా ఆనంద్ సాయి చేతుల మీదుగానే జరిగింది. ప్రధాన శిల్పిగా ఉంది ఆలయాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఆలయాన్ని చూస్తున్న వారు అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆనంద్ సాయికి మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకోబోతున్నారు. అయోధ్య రామ మందిరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని దశాబ్దాల పాటు దీనిపై హిందూ, ముస్లిం మద్యం గొడవలు జరుగుతూ వచ్చాయి. ఫైనల్ గా సుప్రీం కోర్టు అయోధ్య రామమందిర నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.
యూపీలో యోగి సర్కార్ ఈ రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టబోతున్నారు. దీనికి సంబంధించి డిజైన్స్ కూడా రెడీ అయ్యాయి. ఇక ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలని మెయిన్ ఆర్కిటెక్ట్ గా చంద్రకాంత్ సోమపుర ఉన్నారు. అయితే ఆర్కిటెక్ట్ గా ఆనంద్ సాయి కూడా అందులో భాగం కాబోతున్నారు. యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణం ఆనంద్ సాయి చేతుల మీదుగా జరిగిందని తెలుసుకున్న యోగి సర్కార్ అతన్ని పిలిపించి అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వామిని చేసినట్లు తెలుస్తుంది. ఈ రామ మందిరం నిర్మాణం పూర్తయితే అయోధ్యలో అది ఉన్నంత వరకు ఆనంద్ సాయి పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.