BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న అందరి కంటెస్టెంట్స్ లో ఎవరు ఎక్కువగా కంటెంట్ ఇస్తున్నారంటే ఏ మాత్రం సందేహం లేకుండా గీతూ అని చెప్పవచ్చు. సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన మొదటి వారం నుండి తనదైన శైలిలో గీతూ ఏదో ఒక విధంగా బిగ్ బాస్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే వస్తోంది. ఎప్పుడు ఎలా ఉండాలో అలానే ఉంటోంది. అదే విధంగా ఎప్పుడు ఎలా గేమ్ ఆడాలో అలా ఆడుతూ వస్తోంది.
హౌస్ లో గీతూ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాను ఏం చేస్తున్నది అనే దానిపై పిచ్చ క్లారిటీతో ఉంటుంది గీతూ. అందుకోసమేగా గీతూ ఏకంగా నాగార్జున చేత 100 కి 200 వందల మార్కులు సంపాదిస్తుంది. అయినప్పటికీ మీరు చూసింది ఇంకా చాలా తక్కువ సార్… నాలో ఇంకా చాలా ఉంది.. అది కూడా చూపిస్తా అంటూ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది నాగార్జునకి. చెప్పినట్లుగా గీతూ అంతకు మించి ప్రదర్శన ఇస్తూ ముందుకు సాగుతూ పోతోంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో మొదటి సారి ఊహించని షాక్ తగిలింది. నాగార్జున శనివారం ఎపిసోడ్ లో హిట్, ఫ్లాప్ అని ఓ ఫన్నీ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఈ టాస్క్ లో నాగార్జున పిలిచిన ఇద్దరు బోనులోకి వచ్చి ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అనేది చెప్పాల్సి ఉంటుంది. దీంతో నాగార్జున హౌస్ లో అందరికీ చెప్తున్నట్లుగానే ఆదిరెడ్డి, గీతూకి మధ్యన ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అనేది చెప్పాలని సూచిస్తాడు.
దీంతో వారిద్దరూ వారికి వారు ఎందుకు హిట్, ఎందుకు ఫ్లాప్ అనేది చెప్పకుంటారు. ఆ తర్వాత వీరిద్దరిలో ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అని నాగార్జున హౌస్ సభ్యులను అడుగుతాడు. దీంతో హౌస్ సభ్యుల ఎక్కువ మంది ఆదిరెడ్డి హిట్ అని ఓటు వేస్తారు. గీతూకి తక్కువ మంది మద్దతు తెలపడంతో గీతూ ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోతుంది. దీంతో తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్న గీతూకి హౌస్ లో మొదటి సారి ఊహించని విధంగా షాక్ తగిలింది. మరి గీతూ ఈ దెబ్బకు మందుగా ఏం వాడుతుందో చూడాలి..!