BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. దీనికి ముందు కెప్టెన్సీ పోటీదారుడి కోసం హోటల్ వర్సెస్ హోటల్ అనే టాస్క్ కొనసాగింది. ఈ హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో భాగంగా ఎక్కువ డబ్బులు సంపాదించిన వారిలో ఉన్న గీతూ కూడా కెప్టెన్సీ ఎంపిక అయ్యేందుకు జరిగిన టాస్క్ లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తుంది.
మరోవైపు కెప్టెన్సీ పోటీదారుడి కోసం బిగ్ బాస్ పెట్టిన అదే హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో చంటికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. కానీ చంటి ఆ సీక్రెట్ టాస్క్ లో ప్రదర్శన ఇవ్వనందున కెప్టెన్సీ పోటీదారుడి టాస్క్ నుండి తొలగిపోతాడు. ఇక గురువారం ఎపిసోడ్ లో గీతూకి ఊహించని విధంగా చంటీ షాక్ ఇస్తాడు. కెప్టెన్సీ ఎంపికలో టాస్క్ లో భాగంగా రేసులో ఉన్న గీతూని చంటి తొలగించేస్తాడు. కెప్టెన్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న గీతూ ఆశలు అడియాశలుగా మిగిలిపోతాయి.

కెప్టెన్ అంటే అందరినీ కలుపుకుని రిక్వెస్టింగ్ గా నాయకుడిలా ముందుకు సాగాలి.. ఆ లక్షణాలు గీతూలో లేవనే కారణం చెప్తాడు చంటి. దీంతో గేమ్ ఆడటానికి రాని వాళ్లు కూడా నా గురించి చెప్పడమే అంటూ గీతూ కూల్ గా తన మనసులో మాటలను బయటకు చెప్తుంది. దీనికి గీతూ ఎవరికి గేమ్ ఆడటానికి రాదు అంటూ కాసేపు గీతూ, చంటి మధ్య వాదోపవాదనలు జరుగుతాయి.
ఈ వారం జరిగిన నామినేషన్స్ లో వీరిద్దరూ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. అంటే వీరిద్దరి మధ్య గత రెండు వారాల కంటే ముందు నుండే సాగుతోంది. మదొట ఏదో సరదాకి స్టార్ట్ అయిన వీరిద్దరి మధ్య వాదన చివరకు ఒకరిని ఒకరు బిగ్ బాస్ హౌస్ లో తొక్కేసుకుంటూ వెళ్లే వరకు తెచ్చుకున్నారు. ఒకే షోలో కలిసి ప్రదర్శన చేసిన వీళ్లు బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు ఉన్నారు. మరి వీరిద్దరి వ్యవహారం మున్ముందు ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి…!