Amyra Dastur : బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ అద్భుతమైన గ్రీన్ గౌన్ తో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. కటౌట్ గౌనుతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. రీసెంట్ ఫోటో షూట్ లో తన ఒంపు సొంపులను చూపిస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ హాట్ పిక్స్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అమ్మడి లేలేత అందాలను చూస్తూ కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు.

Amyra Dastur : సినిమా వేడుకలైనా, ఫిల్మ్‌ఫేర్ ఫెస్టివల్స్ అయినా , అవార్డ్స్ ఫంక్షన్ లో అయినా స్టార్‌లు తమ బెస్ట్ ఫ్యాషనబుల్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అమైరా దస్తూర్ ఆకుపచ్చ కటౌట్ గౌను తో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ డిజైనర్ భావనా రావు షెల్ఫ్‌ల నుండి సేకరించిన ఈ గౌన్ లో ఏంజెల్ లా మెరిసిపోతోంది ఈ బ్యూటీ.

స్కార్ఫ్ స్టైల్ లో వచ్చిన బ్యాక్ లెస్ బ్లౌజ్ లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది అమైరా. ఈ బ్లౌజ్ కు అటాచ్మెంట్ గా ఫిగర్ హుగ్గింగ్ స్కర్ట్ ను అందించారు డిజైనర్ . గౌన్ మోడల్ లో ఉన్న ఈ గౌను అమైరా కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

ఈ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా డైమండ్ ఆభరణాలను ధరించింది. చెవులకు అలంకరించుకున్న చెవి దుద్దులను అమైరా అన్మోలి జ్యూయెల్లరీ నుంచి ఎన్నుకుంది. స్టైలిస్ట్ మాళవిక తాతర్ అమైరా కు స్టైలిష్ లుక్స్ ను అందించింది.

తన మేకప్ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు అమైరా కళ్ళ కు స్మోకీ ఐ షాడో , బ్లాక్ ఐ లైనర్ , నిగనిగలాడే గోధుమ రంగు లిప్ స్టిక్ ను పెదాలకు వేసుకుని అమైరా గ్లామరస్ లుక్స్ తో అందరిని ఫిదా చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పిక్స్ ను పోస్ట్ చేసిన వెంటనే లైకులు షేర్ ల వర్షం కురుస్తోంది.