Amyjackson: హాలీవుడ్ చిత్రాలలో బిజీగా ఉన్న టైంలో మద్రాసి పట్టణం అనే తమిళ చిత్రంతో ఇండియాలో హీరోయిన్ గా అమీ జాక్సన్ ఎంట్రీ ఇచ్చింది. విదేశాలలో నుండి మనదేశంలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ప్రారంభంలో అవకాశాలు అందుకోవటం జరిగింది. ముఖ్యంగా సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “ఐ”, “రోబో 2.0” ఇంకా పలు బాలీవుడ్ సినిమాలు చేయడం జరిగింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన “ఎవడు” సినిమాలో హీరోయిన్ గా చేసింది. దీంతో ఎంతో పాపులారిటీ సంపాదించిన అమీ జాక్సన్… గత కొంతకాలంగా అవకాశాలు అందుకోవటంలో విఫలం అవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ బ్రిటిష్ తార మతి పోగొట్టే సోయగాలు ఇంకా.. హాట్ లుక్స్ తో .. లేటెస్ట్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.
అతుక్కుపోయే డ్రెస్ తో… కుర్రోళ్ళ కళ్ళల్లో చిచ్చురేపేలా అమీ జాక్సన్.. తన అందంతో రెచ్చిపోయింది. చిరుత పులి చర్మం లాంటి దుస్తులలో అమీ జాక్సన్.. అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో చాలామంది ఆమె ఫాలో అవర్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.