Amith Shah : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోం మత్రి అమిత్ షా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పటేల్ వల్లే ఇదంతా సాధ్యమైందని అమిత్‌షా పేర్కొన్నారు. హైదరాబాద్ విమోచనానికి పటేల్ విశేష కృషి చేశారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్‌కు రాలేదన్నారు. నిజాం, రజాకార్ల ఆగడాలకు.. ఆపరేషన్ పోలో ద్వారా పటేల్ ముగింపు పలికారని అమిత్ షా కొనియాడారు. పటేల్ పోలీస్ యాక్షన్‌తో నిజాం సైన్యం తలవంచిందన్నారు. పటేల్ లేకపోతే హైదరాబాద్ విమోచనానికి మరింత సమయం పట్టేదని అమిత్ షా పేర్కొన్నారు.
విమోచన దినాన్ని కొందరు రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని అమిత్ షా పేర్కొన్నారు. విమోచన దినం జరిపేందుకు ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం సాహసించలేదన్నారు. తెలంగాణను పాలించిన పార్టీలన్నీ ఓటు బ్యాంకు కోసమే పనిచేశాయన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదన్నారు. విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని మోదీ ఆదేశించారని అమిత్ షా వెల్లడించారు. విమోచన దినోత్సవాన్ని రాజకీయంగా వాడుకోవటం దుర్మార్గ చర్య అని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించలేదని అమిత్ షా ప్రశ్నించారు.
Amith Shah : మునుగోడు బై పోల్ సహా.. అసెంబ్లీ ఎన్నికలకు దిశా నిర్దేశం..
ప్రధాని మోదీ చొరవతోనే హైదరాబాద్ ముక్తి దినోత్సవం జరుపుతున్నట్టు అమిత్ షా వెల్లడించారు. కాగా.. మరికాసేపట్లో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. అమిత్ షాతో బీజేపీ నేతల సమావేశంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సమావేశానికి బండి సంజయ్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అర్చింద్, డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, గరికపాటి, పొంగులేటి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో మునుగోడు బైపోల్ సహా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.