Ambati Rayudu: టీమిండియాలో మంచి ప్రతిభను కనపరిచి, గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్ గా అంబటి రాయుడు నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఈ కుర్రాడు.. అంచలంచలుగా ఎదిగి టీమిండియాలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. టీమిండియాలో ఓ మెరుపు మెరిసిన అంబటి.. తాజాగా ఓ వివాదంతో వార్తల్లో నిలిచాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా టీంకు కెప్టెన్ గా అంబటి రాయుడు కొనసాగుతున్నాడు. గ్రూప్-డి మ్యాచుల్లో భాగంగా బరోడా టీం, సౌరాష్ట్ర టీం మధ్య మ్యాచ్ ఉండగా.. ఆ మ్యాచ్ లోనే సౌరాష్ట్ర టీంకు చెందిన షెల్డన్ జాక్సన్ అనే క్రికెటర్ తో అంబటి వాదులాటకు దిగాడు. అంబటి, షెల్డన్ ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ఒకరి మీదకు ఒకరు దూకారు.
పరిస్థితి వేడెక్కుతుండటంతో అక్కడే ఉన్న ఇద్దరు ఎంపైర్లు, కృనాల్ పాండ్యాలు జోక్యం చేసుకొని.. ఇద్దరికి సర్ది చెప్పారు. కృనాల్ పాండ్యా అంబటి రాయుడును దూరంగా తీసుకెళ్లాడు. తర్వాత ఎంపైర్లు అంబటితో మాట్లాడి, గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే సౌరాష్ట్ర బ్యాట్స్ మన్ షెల్డన్ జాక్సన్ బ్యాటింగ్ కు ఆలస్యంగా రావడంతో అంబటి రాయుడు కోపగించుకున్నాడు.
Ambati Rayudu:
ఇదే విషయాన్ని షెల్డన్ జాక్సన్ రాగానే ప్రశ్నించగా.. షెల్డన్ అంబటి రాయుడు మీదకు కోపంగా వెళ్లాడు. దీంతో వీరిద్దరు గొడవ పడ్డారు. అయితే ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/12th_khiladi/status/1580167395393810438?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1580167395393810438%7Ctwgr%5E282ccd7b8ad9f9156894fad9ae72da5dee3a714d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fsports%2Fcricket%2Ffight-between-ambati-rayudu-and-sheldon-jackson-in-syed-mushtaq-ali-trophy-56592
కాగా ఈ మ్యాచ్ లో అంబటి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బరోడా టీం 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బరోడా కెప్టెన్ అంబటి రాయుడు మొదటి బాల్ కే ఉనద్కట్ చేతిలో వికెట్ కోల్పోయాడు.