సౌత్ ఇండియాలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అమలాపాల్. ఈ బ్యూటీ సక్సెస్ చేతిలో ఉండి అవకాశాలు పుష్కలంగా వస్తున్న సమయంలో దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తరువాత రెండేళ్లకి ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
ఇక విడాకుల తర్వాత ఈ బ్యూటీ డ్రెస్సింగ్ విషయంలో పూర్తిగా హద్దులు చెరిపేసింది. బికినీ, హాట్ హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతుంది. అవకాశం దొరికిన ప్రతి సారి ఇంస్టాగ్రామ్ లో తన అందాలని తెరిపారా చూపిస్తూ అభిమానులని అలరిస్తుంది. ఇక సినిమాల పరంగా కూడా కమర్షియల్ కథల జోలికి పోకుండా నటిగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే చిత్రాలు చేస్తుంది.
ఒక మొదటి భర్తకి విడాకులు ఇచ్చిన కొద్ది కాలానికే మరో వ్యక్తిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు. వారిద్దరి పెళ్లి ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. అయితే ఆ సమయంలో అవి ఓ యాడ్ కోసం తీసుకున్న ఫోటోలు అని చెప్పి ఎస్కెప్ అయ్యింది. తాజాగా రెండో భర్తని మాజీ బాయ్ ఫ్రెండ్ కి సొసైటీకి రిప్రజెంట్ చేస్తూ అతను వేధింపులకి గురి చేస్తున్నట్లు పోలీసులకి ఫిర్యాదు చేసింది.
ఇక ఆ ప్రియుడు అమలాపాల్ తో తనకి పెళ్లి అయ్యిందని ఆధారాలు చూపించడంతో ఆమె సైలెంట్ అయిపొయింది. కొద్ది రోజుల క్రితం మెగా ఫామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇలా ఓ వైపు వివాదాలతో సహవాసం చేస్తున్న, హ్యాపీగా ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ గడుపుతుంది.
బీచ్ లో రకరకాల హాట్ హాట్ డ్రెస్సులుతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెడుతుంది. తాజాగా అమలాపాల్ పెట్టిన ఫోటోలు మరోసారి వైరల్ గా మారాయి.