Allu Sneha : పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ ఏమిటో చూపించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అన్ని భాషలలో ఆల్ టైం హిట్ సాధించి అందరి ఫేవరెట్ హీరోగా మారిపోయాడు బన్నీ. అల్లు అర్జున్ కే కాదు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఫాలోయింగ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్లకు దీటుగా అందంలో ఏమాత్రం తీసిపోదు స్నేహ. ఆ అందాన్నే అస్త్రంగా మార్చుకుని సోషల్ మీడియాను ఏలుతోంది.

స్టార్ హీరోల భార్యలందరిలోనూ స్నేహ టాప్ ప్లేస్ లో ఉంటుంది. జ్యోతిక, ఉపాసన, నమ్రత, ఇలా చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నా స్నేహ కున్న ఫాలోయింగ్ వేరు. 9 మిలియన్లకు దగ్గరగా ఫాలోవర్స్ ఉన్నారంటే స్నేహ క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేసేందుకు స్నేహ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ అలరిస్తుంది. తాజాగా చేసిన ఫోటోషూట్ పిక్స్ కూడా ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. స్నేహ లుక్స్ పైనే అందరి చూపులు పడ్డాయి.

సోషల్ మీడియాలో స్నేహ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. బన్నీతో కలిసి టూర్ కి వెళ్లినా, పిల్లలతో టైం పాస్ చేసినా, ఫోటో షూట్లు చేసినా అప్డేట్స్ వెంటనే ఫాలోవర్స్ ముందు ఉంచేస్తుంది స్నేహ. లేటెస్ట్ గా మెటాలిక్ శారీ కట్టుకుని మెస్మెరైజ్ చేస్తోంది అల్లు స్నేహ. ఈ అద్భుతమైన చీరను రిమ్ జిమ్ దాదు ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. స్టార్ హీరోయిన్ సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుఖల్కర్ స్నేహకు స్టైలిష్ లుక్ ని అందించాడు.


కుర్ర హీరోయిన్లను కూడా తలదన్నేలా గ్లామరస్ లుక్స్ తో అలరిస్తోంది స్నేహ. ఈ మెటాలిక్ చీరకొచ్చిన లీఫీ పళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చీరకు మ్యాచింగ్ గా షోల్డర్ లెస్ బ్రాలెట్ వేసుకుని అందాలతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ అవుట్ ఫుట్ తో చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. స్నేహ లుక్స్ పైన క్రేజీ కామెంట్లు వస్తున్నాయి.

గతంలోనూ ఇలా అద్భుతమైన అవుట్ ఫిట్స్ వేసుకొని అందర్నీ ఆకట్టుకుంది స్నేహ. చీర కట్టులోనూ ఎంతో హాట్ గా కనిపించింది. ఫ్యాషన్ విషయంలో స్టైలిష్ స్టార్ భార్య అని నిరూపించుకుంది.

అంతకుముందు అమిత్ అగర్వాల్ రూపొందించిన డిజైనర్ అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంది స్నేహ. ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్న శారీ లో ఎంతో హాట్ గా కనిపించింది.
