Allu Sirish : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముద్దుల తనయుడు అల్లు శిరీష్‌కు ఇండస్ట్రీ ఎందుకో కానీ పెద్దగా కలిసి రాలేదు. ఎంచుకున్న కథలన్నీ చాలా ఆసక్తికరమైనవే. అయినా ఎందుకో.. ఎక్కడ దెబ్బ పడుతోందో కానీ గౌరవం నుంచి ABCD మూవీ వరకూ నటించిన సినిమాలన్నీ ఫట్ అయ్యాయి. పోనీ కథ ఏమైనా పాతదా? అంటే అదీకాదు.. ఒక కొత్తదనమున్న కథ. ఎవరూ టచ్ చేయని కథతో వచ్చినా కూడా ఇండస్ట్రీలో హిట్ పడలేదు. ఇక లాభం లేదు అనుకున్నాడో ఏమో కానీ బాగా లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ ఒక చిత్రంలో నటించాడు.
అల్లు శిరీష్ తాజాగా నటించిన ఊర్వసివో రాక్షసివో చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.
కోలీవుడ్ మూవీ ప్యాప్ ప్రేమ కాదల్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ రాకేశ్ శశి రూపొందించారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రం తప్పనిసరిగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు అల్లు శిరీష్.
ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఇక అల్లు శిరీష్ క్షణం తీరిక లేకుండా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. తాజాగా మనోడు అనుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని బీభత్సంగా టాక్ నడుస్తోంది. దీనిపై స్పందించిన శిరీష్.. వాటన్నింటినీ రూమర్స్ మాత్రమేనని కొ్ట్టిపడేశాడు. సినీ తారలపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవడం సర్వ సాధారణమని తేల్చేశాడు. ఇప్పుడైతే ఇదొక్కటేనని గతంలో అయితే ఇలాంటివి చాలా వచ్చాయని చెప్పాడు. అనుతో ప్రేమ లాంటివేం లేవని.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు.