బన్నీ ఇటీవల బాలీవుడ్ లో పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా బన్నీ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన రెండో వివాహానికి హాజరయ్యారు. ఆర్జీవీ బామ్మర్ది, నిర్మాత మధు మంతెన ఆదివారం రాత్రి ప్రముఖ యోగ ట్రైనర్ ఐరా త్రివేదిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు విచ్చేసారు. అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు.

అల్లు అర్జున్ సందడి :
అయితే ఈ వివాహ వేడుకలో అల్లు అర్జున్.. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తో సరదాగా కాసేపు ముచ్చరించారు. హృతిక్ రోషన్ బన్నీని ఆప్యాయంగా హత్తుకున్నాడు. దీంతో బన్నీ హృతిక్ కి హగ్ ఇచ్చే ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పక్కనే అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు. దీంతో బన్నీ అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.
ఈ క్షణాన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని మరో ప్రముఖ వ్యక్తి అమీర్ ఖాన్ మరియు పలువురు హాజరైనవారు కూడా చూశారు. హృతిక్ మరియు అల్లు అర్జున్ కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం ఉందని అభిమానులు తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు, అయితే అది జరుగుతుందో లేదో చూడాలి.అల్లు అర్జున్ తన పైప్‌లైన్‌లో పుష్ప 2 ఉండగా, హృతిక్ ఫైటర్‌పై దృష్టి పెట్టాడు.