Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. సెప్టెంబర్ 29వ తారీకు.. స్నేహ రెడ్డి పుట్టినరోజు కావటంతో పిల్లలు అల్లు అర్హ, అయన్ ల సమక్షంలో భార్యతో బన్నీ కేక్ కట్ చేయించడం జరిగింది. ఈ క్రమంలో భార్య భర్తడే ట్రీట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా.. బన్నీ అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు “హ్యాపీ బర్తడే క్యూటీ” అనే కామెంట్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఇదే సమయంలో పంజాబ్ అమృత సర్ లోని స్వర్ణ దేవాలయం సందర్శించడం జరిగింది. కుటుంబంతో కలిసి బన్నీ స్వర్ణ దేవాలయం దగ్గర దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“పుష్ప” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బన్నీ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో “పుష్ప 2” షూటింగ్ స్టార్ట్ కానుంది. వచ్చే ఏప్రిల్ నెలలోనే సినిమా విడుదల చేసే తరహాలో సుకుమార్ షెడ్యూల్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సరిగ్గా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు బన్నీ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
“పుష్ప 2” మొదటి భాగం కంటే ఎక్కువ భాషలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు కూడా “పుష్ప 2″లో నటించనున్నట్లు సమాచారం. “పుష్ప” మొదటి భాగం డైలాగులు మరియు పాటలు ఎంతగానో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికే పర్ఫెక్ట్ ట్యూన్స్ సెట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే అల్లు స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభమై తర్వాత ఫారెస్ట్ లో లాంగ్ షెడ్యూల్ లో బన్నీ జాయిన్ కానున్నట్లు టాక్ నడుస్తోంది.