ఏషియన్ సంస్థ వరసగా స్టార్ హీరోలతో టై అప్ అయ్యి థియేటర్స్ నిర్మిస్తుంది.ముందుగా హైదరాబాద్ లో మహేష్ బాబుతో టై అప్ అయ్యి ఏ.ఏం.బి థియేటర్ ను నిర్మించిన ఏషియన్ సంస్థ ఆతర్వాత యువ హీరో విజయ దేవరకొండతో టై అప్ అయ్యి మెహబూబ్ నగర్ లో ఏ.వి.డి థియేటర్ ను ప్రారంభించింది.తాజాగా ఏషియన్ సంస్థ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో టై అప్ అయ్యి ఆయన పేరు మీద హైదరాబాద్ లో ఒక నూతన థియేటర్ ను ఓపెన్ చేయనున్నది.దీనికి సంబంధించి జరిగిన పూజ కార్యక్రమంలో తాజాగా అల్లు అర్జున్ పాల్గొన్నాడు.దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ థియేటర్ అధునాతన టెక్నాలజీ కలిగి ఉండబోతుందని త్వరలో ఈ థియేటర్ సినీ అభిమానులను అలరించే బాధ్యతను తీసుకోబోతున్నట్లు సమాచారం.