పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇండియన్ వైడ్ గా బన్నీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పుష్ప సినిమాతో సొంతం అయ్యింది. ఇక పుష్ప సినిమాలోని కొన్ని పాపులర్ డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాచూర్యంలోకి వెళ్లిపోయాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఒక్క హిందీలోనే వంద కోట్ల వరకు పుష్ప సినిమా కలెక్ట్ చేసింది అంటే ఎ రేంజ్ లో నార్త్ ఇండియా ఆడియన్స్ ని సినిమా రీచ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది.
ఈ మూవీ మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపధ్యంలో సుకుమార్ ఈ సీక్వెల్ ని మరింత గ్రాండియర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్ దర్శకుల జాబితాలో చాలా మంది ఉన్నారు. అందులో కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరితో సినిమా స్టార్ట్ అవుతుందని అనేది చెప్పలేం. ఇక ఈ దర్శకులు ఇద్దరు ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ పైన ఉన్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శకులు సైతం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని బోగట్టా.
అలాగే అక్కడ బడా ప్రొడక్షన్ హౌస్ లు కూడా బన్నీ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ గురించి టాలీవుడ్ హాట్ చర్చ నడుస్తుంది. అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో గతంలో రేసుగుర్రం సినిమా వచ్చింది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక సురేందర్ రెడ్డి రీసెంట్ గా బన్నీకి ఓ యూనివర్శల్ సబ్జెక్టు చెప్పి ఒప్పించినట్లు టాక్. అఖిల్ తో ఏజెంట్ సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుంది. దీని తర్వాత బన్నీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్.