టాలీవుడ్ లో స్టైలిష్ హీరోగా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్ గా తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, నార్త్ ఇండియా ఆడియన్స్ సైతం బన్నీ స్టైల్ కి ఫిదా అయిపోయారు. ఈ నేపధ్యంలో అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అల్లు అర్జున్ తో తమ ఉత్పత్తులని ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో ఒక్కో బాషకి ఒక్కో హీరోని తీసుకొని ఉత్పత్తులని ప్రచారం చేసుకునే వారు అయితే అల్లు అర్జున్ మార్కెట్ పరిధి, అతని ఫేమ్ విస్తరించడంతో సౌత్ ఇండియాలో ఎండార్స్మెంట్ ల కోసం అల్లు అర్జున్ ని ఎక్కువ మంది సంప్రదిస్తున్నారు.
ప్రస్తుతం సౌత్ లో ఎక్కువగా యాడ్స్ లో నటించే స్టార్స్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తున్నారు. ప్రముఖ కంపెనీలు అన్ని కూడా తమ ఉత్పత్తులని వీరితో మార్కెట్ చేయించుకుంటున్నాయి. ఇక మీషో కోసం రామ్ చరణ్ కొత్తగా యాడ్స్ లోకి అడుగుపెట్టాడు. తారక్ కూడా గతంలో నవరత్న ఆయిల్ కోసం ప్రచారం చేసేవాడు. అయితే ఇప్పుడు కంపెనీల దృష్టి ఎక్కువగా అల్లు అర్జున్ మీదనే ఉన్నట్లు తెలుస్తుంది. అతని స్టైలిష్ లుక్ తో ప్రోడక్ట్ ని వేగంగాప్రెజెంట్ ట్రెండ్ కి రీచ్ అయ్యే విధంగా చేయొచ్చని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ కి ఒక్కో యాడ్ కోసం ఏకంగా 9 కోట్ల వరకు కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బన్నీ 5 కంపెనీలకి సంబందించిన ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి ఏకంగా 45 కోట్ల రూపాయిలని తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన సౌత్ లో యాడ్స్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న హీరోల జాబితాలో బన్నీ టాప్ లోకి వచ్చాడని మాట ఇప్పుడు వినిపిస్తుంది.