Allu Arjun Pushpa: అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రానికి తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అంచనాలు లేకుండా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా హిందీలో అయితే అసలు రిలీజ్ చేయొద్దని భావించారట. కానీ అక్కడే సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించింది. దీంతో పార్ట్ 2 కోసం కాస్త సమయం తీసుకున్నా ఫర్లేదని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. అందుకే పుష్ప రిలీజ్ తర్వాత వెంటనే హడావుడిగా పార్ట్ 2 రిలీజ్ చేయకుండా ఆగిందట చిత్ర బృందం.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ డైలాగులు, నటన, డ్యాన్స్, హావభావాలు ఎంత ఇంపాక్ట్ చూపాయో, సినిమాకు మ్యూజిక్ కూడా అందే ప్రభావం చూపింది. రష్మిక మంధాన హీరోయిన్ పాత్ర కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే తీశాడు సుకుమార్. యాక్షన్ సన్నివేశాల్లో మ్యూజిక్ అదరగొట్టారు. తగ్గేదే ల్యా.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ… అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు సినిమాకు చాలా ప్లస్ పాయింట్ గా నిలుస్తాయి.
అయితే, ఫిల్మ్ ఫేర్ వార్డులు దక్కిన సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, పుష్ప సినిమాలో డైలాగ్ లు అంత పవర్ ఫుల్ గా రావడానికి గల కారణాలను వెల్లడించాడు. సినిమా షూటింగ్ సందర్భంగా మరో దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ సారి అల్లు అర్జున్ కలిశాడట. ఇందులో డైలాగుల గురించి ఆసక్తికర చర్చ జరిగిందట. అయితే, హరీష్ శంకర్ స్పందిస్తూ.. టైటిల్ కాస్త మెత్తగా ఉందని చెప్పగా.. ఇదే విషయాన్ని సుక్కు వద్ద ప్రస్తావించాడట అల్లు అర్జున్.
Allu Arjun Pushpa:
ఇక్కడే సుక్కు మార్క్ డైలాగులు తన్నుకొని వచ్చాయట. అప్పుడే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ… అనే డైలాగ్ రాశాడట దర్శకుడు సుకుమార్. హరీష్ శంకర్ చెప్పడం వల్లే ఇంతటి పవర్ ఫుల్ డైలాగ్ బయటకొచ్చిందని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.