Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇది వరకు సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా మరింత గుర్తింపు పొందారు. పుష్ప సినిమాతో ఈయన కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ పొందారు.
ఇలా కేవలం నార్త్ ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ కి అభిమానులుగా మారిపోవడం విశేషం.ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఈ సినిమా విజయం పై స్పందించారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని తను అసలు ఊహించలేదంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ విధంగా ఈ సినిమా ద్వారా తనకు ఎంతోమంది అభిమానులు పెరగడమే కాకుండా ఎంతో ప్రేమ కూడా వారి నుంచి లభించిందని ఈయన తెలిపారు.ఒకవేళ పుష్ప సినిమాలో నేను కనుక నటించకపోయి ఉంటే అభిమానుల నుంచి ఇలాంటి ప్రేమ సంపాదించుకోవడానికి నాకు మరో 20 ఏళ్లు సమయం పట్టేది అంటూ ఈ సందర్భంగా ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Allu Arjun: పుష్ప సినిమా చేయకపోతే ఇంత ప్రేమ పొందే వాడిని కాదు..
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్నటువంటి పుష్ప 2సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా కూడా పుష్ప సినిమాకి మించి ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పుష్ప 2సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోనున్నట్లు సమాచారం.