Allu Arjun : టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిన్న మొన్నటి వరకూ సౌత్ ఇండియాకే పరిమితమైన అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ఇప్పుడు నేషనల్‌కు సైతం పాకింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో మనోడి రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతకు ముందే ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ రాలేదంటే అతిశయోక్తి కాదు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేర్ ఫీట్‌ను అందుకున్నాడు.సౌత్ హీరోలందరి కంటే ఇంస్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న హీరోగా బన్నీ రికార్డులు క్రియేట్ చేశాడు.బన్నీ ఫాలోయర్ల సంఖ్య ప్రస్తుతం 19 మిలియన్లకు చేరుకుంది. ఇక బన్నీ తరువాత స్థానంలో విజయ్ దేవరకొండ 17.3 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.అయితే మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం రౌండ్ ఫిగర్ చేసేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు.త్వరలోనే 20 మిలియన్లకు చేర్చాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ట్విటర్‌లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబే టాప్‌లో ఉన్నాడు.
Allu Arjun : ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ నైజాం (తెలంగాణ)లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చూసి కామన్ పీపుల్‌తో పాటు సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్‌ను మెచ్చుకున్నారు. ఇక ‘పుష్ప 2’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.