మెగా ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి కొంత కాలం పాటు అదే బ్రాండ్ తో కొనసాగి ఇప్పుడు అల్లు బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న హీరో అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నీడ నుంచి బయటకి వచ్చి తనని తాను యూనిక్ గా ప్రెజెంట్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు. మిగిలిన మెగా హీరోలకంటే తాను భిన్నం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తన సినిమా ఫంక్షన్స్ లో కూడా గతంలో మాదిరిగా ఎక్కువగా మెగాస్టార్ జపం చేయకుండా తన తండ్రి అల్లు అరవింద్ ని పైకి లేపే ప్రయత్నం మొదలు పెట్టారు.
అలాగే తన ఫ్యాన్స్ అందరిని మెగా ఫ్యాన్స్ నుంచి పూర్తిగా వేరు చేసేసాడు. అల్లు ఆర్మీ అంటూ కొత్తగా వారిని పరిచయం చేసాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తనని తాను అల్లు హీరోగానే రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో ప్రతి కుటుంబానికి ఒక బ్రాండ్ వేల్యూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ బ్రాండ్, అలాగే నందమూరి ఫామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ లకి టాలీవుడ్ లో ఒక వేల్యూ ఉంది. అయితే ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు. అయితే అతని బ్రాండ్ వేల్యూని మాత్రం ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అల్లు అరవింద్ నిర్మాతగా నిలబడిన కొంత వరకు స్టార్ ప్రొడ్యూసర్ గా అల్లు బ్రాండ్ ని తీసుకెళ్లారు.
అయితే ఇప్పుడు అల్లు బ్రాండ్ వేల్యూకి టాలీవుడ్ లో అల్లు అర్జున్ మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. అల్లువారి అబ్బాయి, అల్లు హీరో అని ఇప్పుడు బన్నీని శిరీష్ ని అంటున్నారు అంటే దానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పాలి. తాజాగా ఇదే విషయాన్ని అలీతో ఇంటర్వ్యూలో కూడా అల్లు అరవింద్ చెప్పడం విశేషం. అల్లు అర్జున్ కారణంగా అల్లు ఇంటిపేరు బ్రాండ్ వేల్యూ పెరిగిందని చెప్పుకొచ్చారు. తన తండ్రికి అల్లు ఇంటి పేరు అంటే చాలా ఇష్టం అని దానిని బన్నీ తన భుజాలపై ఎత్తుకొని ఒక గుర్తింపు తీసుకొచ్చాడని పుత్రోత్సాహాన్ని ప్రదర్శించారు.