Allu Arjun: దీపావళి పండగ అనగానే అందరికీ ఒకరకమైన జోష్ వచ్చేస్తుంటుంది. దీపాల వెలుగులు, నోరూరించే స్వీట్లు, కొత్త బట్టలు, మోత మోగే టపాసులు పండగకు ప్రత్యేక కలను తెస్తుంటాయి. ఇలాంటి దీపావళిని అందరూ ఎంతో అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా జరుపుకుంటూ ఉంటారు.
తాజాగా అల్లు ఫ్యామిలీ దీపావళి సంబరాలు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. సన్నిహితులు, బంధువులతో కలిసి అల్లు ఫ్యామిలీ దీపావళిని ఘనంగా నిర్వహించగా.. అందరికీ అల్లు కుటుంబ సభ్యులు పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, అతడి భార్య స్నేహా రెడ్డి, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారికతలతో పాటు పలువురు ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హోస్ట్ చేసినట్లు తెలుస్తుండగా.. బయటకు వచ్చిన వీడియో మరియు ఫోటోల్లో అల్లు అర్జున్, అతడి భార్య స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టేశారు.
Allu Arjun:
ప్రతి సంవత్సరం దీపావళిని ముందే ప్లాన్ చేసుకొనే అల్లు ఫ్యామిలీ ఈసారి స్నేహితులు,బంధువులతో ప్రత్యేకంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు మరియు వీడియోలు చూసిన బన్నీ ఫ్యాన్స్, మెగా అభిమానులు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు దీపావళి వేళ పేదలకు స్వీట్లు, పండ్లు, టపాసులు కొనివ్వడం వార్తల్లో వచ్చింది.