నటుడు అల్లు అర్జున్ తన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ అయిన పుష్ప 2: ది రూల్‌లో కనిపించబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్, జగదీష్ తదితరులు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.