Allu Aravind: అల్లు అరవింద్ తెలుగులోనే కాదు దేశంలోనే పెద్ద నిర్మాతల్లో ఒకరు. మగధీర చిత్రంతో తెలుగు చలనచిత్ర చరిత్రని తిరగరాసిన ఈ మెగా ప్రొడ్యూసర్ గజిని చిత్రంతో బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించారు. బాలీవుడ్ కి తొలి 100 కోట్ల చిత్రాన్ని అందించిన చరిత్ర ఆయన సొంతం. ఇక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఒక ఆసక్తికరమైన సంఘటనను అందరితో పంచుకున్నారు.
ప్రముఖ తెలుగు నటుడు-కమీడియన్ అలీ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో అల్లు అరవింద్ గెస్ట్ గా మెరిశారు. 47 ఏళ్ల వయసులో ఆయనని ఒకరు చెంపదెబ్బ కొట్టారట. అది ఎవరో కాదు,ఆయన తండ్రి అల్లు రామలింగయ్య,తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకున్న ఒక లెజెండరీ నటుడు.
అల్లు రామలింగయ్య గురించి చెపుతూ,ఆయన ఎపుడూ సీరియస్ గా ఉంటారని అలా కోపంతోనే తన చెంప చెల్లుమనిపించారు అని అల్లు అరవింద్ అన్నారు. వివరాల్లోకి వెళితే అల్లు రామలింగయ్య గారు,ఆయన సతీమణి ఒక విషయంలో బాగా గొడవపడ్డారు. కోపంలో ఆయన కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా బయటకి వెళ్లి[పోయారు. అల్లు అరవింద్ తల్లిగారు ఆయనకి ఈ విషయం చెప్పారు
Allu Aravind:
ఎలాగోలా ఒప్పించి అల్లు రామలింగయ్య ని కారు ఎక్కించారట అల్లు అరవింద్. తండ్రి చెప్పులు లేకుండా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని అరవింద్ గట్టిగా బ్రేక్ వేశారు. సడన్ గా బ్రేక్ వేయడంతో అల్లు రామలింగయ్య ముందుకు పడ్డారు. బండి అలా ఆగడంతో అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ కి ఒకటి తగిలించారట. నాన్న కొడితే కొట్టారుగాని,భార్య చూడలేదులే అని సంబరపడ్డారట అల్లు అరవింద్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అల్లు అరవింద్ భార్య అడిగారట ఏమైంది మావయ్య గారు అలా చేశారు అని. దీంతో అవాక్కవ్వడం అల్లు అరవింద్ వంతైంది.