Allu Aravind: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో పంథా. కొంతమంది సినిమాల్లో మంచి పేరు కోసం కష్టపడుతుంటే, మరికొందరు వేర్వేరు వ్యాపారాల వైపు చూస్తుంటారు. సినిమా వాళ్లు అంటే కేవలం సినిమాలు అనే కాకుండా, ఇతర వాటిపై కూడా దృష్టిపెడుతుంటారు. ఏం చేసినా లాభాలు రావడమే అందరికీ ముఖ్యం. ఇండస్ట్రీలో కమర్షియల్ గా ఆలోచించే వ్యక్తుల జాబితాలో అల్లు అరవింద్ ముందుంటాడు.
అల్లు రామలింగయ్య వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా, పెద్దగా కలిసి రాకపోవడంతో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత బావ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన అన్ని ఆర్థిక విషయాలను అల్లు అర్జున్ చూసుకున్నాడు. తెలుగులో డబ్బుల విషయంలో, లెక్కల విషయంలో అల్లు అర్జున్ ని మించిన వాళ్లు ఎవరూ లేరని ఓ టాక్ ఉంది. ఆయన కూడా ఆ విషయంలో చాలాసార్లు రైట్ అనిపించుకున్నారు కూడా.
ఇక తాజాగా అల్లు అరవింద్ ట్యాలెంట్ కు టాలీవుడ్ జనాలు ఫిదా అవుతున్నారు. కమర్షియల్ పాయింట్ లో ఎలా ఆలోచించాలో అల్లు అరవింద్ ని చూసి నేర్చుకోవాలంటూ జనాలు హితవు పలుకుతున్నారు. కాగా అల్లు అర్జున్ అంతలా ట్యాలెంట్ చూపించిన విషయం ఏమిటంటే.. బాలయ్యతో అన్ స్టాపబుల్ ప్లాన్ చేయడం, అన్ స్టాపబుల్2 షోకి చంద్రబాబు నాయుడును గెస్టుగా పిలవడం.
స్క్రీన్ మీద భారీ డైలాగులతో అదరగొట్టే బాలయ్యతో టాక్ షోని, అది కూడా ఓటీటీ ప్లాట్ ఫాం మీద చేసి అల్లు అరవింద్ పెద్ద ప్రయోగమే చేశాడు. అయితే ఆ ప్రయోగం వర్కవుట్ అయింది. దీంతో అన్ స్టాపబుల్ హిట్ అయింది. ఆ తర్వాత అన్ స్టాపబుల్2 మీద చర్చ మొదలైంది. దీంతో అన్ స్టాపబుల్2ని వేరే లెవల్ కి తీసుకెళ్లడంలో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని గెస్టుగా పిలవడం, నందమూరి బాలయ్య హోస్ట్ గా మారడంతో.. షో రక్తికట్టింది.
Allu Aravind: అల్లు అరవింద్ ట్యాలెంట్ కు ఫిదా
బావాబావమరిది అయిన చంద్రబాబు నాయుడు, బాలయ్యలు షోలో ఉండటం, రాజకీయ అంశాలను ప్రోమోలో ప్రస్తావించడంతో ఇది హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ ఎపిసోడ్ కు సంబంధించిన చర్చ రావడం, అది రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మొత్తానికి ఎలాగోలా అన్ స్టాపబుల్2 షోకి భారీగా ఓపెనింగ్స్ తీసుకురాగలిగారు. అల్లు అరవింద్ మాస్టర్ మైండ్ వల్లే.. బాలయ్య షోకి చంద్రబాబు వచ్చాడని, సరిగ్గా ఏ పాయింట్లతో ప్రోమో కట్ చేస్తే వర్కవుట్ అవుతుందో కూడా డైరెక్షన్ ఇచ్చాడట. ఇలా అల్లు అరవింద్ చూపించిన ట్యాలెంట్ కు సినీ, రాజకీయ జనాలు ఇప్పుడు ‘ఆహా’ అంటున్నారు.