అల్లరి నరేష్ అంటే టాలీవుడ్ లో కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవాడు. ఈ తరం కామెడీ చిత్రాల హీరో అంటే అతని తర్వాతే. రాజేంద్రప్రసాద్ స్థాయిలో అల్లరి నరేష్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒక దశలో అతను చేసిన కామెడీ చిత్రాలు అన్నివరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. పసలేని కామెడీతో ప్రేక్షకులని మెప్పించలేకపోయారు. ఇప్పటికే ప్రేక్షకులు వినోదాన్ని జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలతో పాటు, షార్ట్ వీడియోల ద్వారా, అలాగే మీమ్స్ ద్వారా చూస్తూ ఆశ్వాదిస్తున్నారు. స్వచ్ఛమైన వినోదం మాత్రం ఎవరూ అందించలేకపోతున్నారు. జాతిరత్నాలు తరహాలో క్లీన్ కామెడీ చిత్రాలని దర్శకులు తీయలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో అల్లరి నరేష్ కూడా తనకి కామెడీ చిత్రాలు వర్క్ అవుట్ కావడం లేదని ఫిక్స్ అయ్యి రూట్ మార్చేశాడు.
విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో నాంది సినిమా సీరియస్ కాన్సెప్ట్ తో సరికొత్త ఎలిమెంట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాతో మళ్ళీ చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక దీని తర్వాత ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం అనే సినిమా చేశాడు. ఈ మూవీ కూడా సీరియస్ ఎలిమెంట్ తోనే తెరకెక్కింది. ఓటుహక్కు లేని గిరిజన ప్రజల కోసం ప్రభుత్వ అధికారి పాత్రలో అల్లరి నరేష్ ఎం చేసాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సరికొత్త లైన్ తోనే ఈ మూవీతెరకెక్కింది.
ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే మరో సారి తనకి నాంది లాంటి సక్సెస్ ఇచ్చిన విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలోనే అల్లరి నరేష్ ఉగ్రం అనే మరో కాన్సెప్ట్ బేస్ మూవీకి ఒకే చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా స్టార్ట్ అయ్యింది. ముఖం నిండా రక్తపు మరకలతో ఉన్న నరేష్ ఫోటోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి ఉగ్రం షూటింగ్ స్టార్ట్ అయినట్లు చెప్పింది. ఈ ఫోటో సినిమా ఇంటెన్సిటీ ఏంటో చెప్పకనే చెబుతుంది. మొత్తానికి అల్లరోడి సినిమాల రోడ్ మ్యాప్ చూసుకుంటే ఇక కామెడీ చిత్రాల జోలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తుంది.