Allari Naresh: టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు కేరఫ్ అడ్రెస్ ఎవరంటే అందరూ చెప్పే ఒకే ఒక్కపేరు అల్లరి నరేశ్. ఈవీవీ సత్యనారాయణ రెండవ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేశ్ తరువాత తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన సిని ప్రయాణం గురించి కొన్ని ఆశక్తికర విషయాలను బయటపెట్టారు.
తను అల్లరి సినిమాకు ముందు చాలామంది దర్శకులను అవకాశాల కోసం కలిసానని, కాని ఎవరు తనకు ఛాన్స్ ఇవ్వలేదని తెలిపారు. అలాగే తను కూడా అందరిలాగే పార్టీలకు వెళతానని ఫ్రెండ్స్‌తో సరదాగా టైమ్ గడుపుతానని, అలాగే తన లైఫ్‌స్టైల్ చాలా సింపుల్‌గా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పకొచ్చారు.
నా పక్క సీట్‌లో అమ్మాయి వస్తే బాగుంటాది అనుకుంటా : నరేశ్
అందరి అబ్బాయిలాగే తను కూడా అమ్మాయిలకు బాగా లైన్ వేసేవాడినని నరేష్ తను చేసిన చిలిపి పనుల గురించి ఈ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. తను హీరోగా రాణిస్తున్న సమయంలో ఒక అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ అదిగిందని, నేను యాక్టర్ కాకపోయి ఉంటే తన నెంబర్ అడిగి తీసుకునేవాడినని ఆయన చెప్పారు. తను ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు తన పక్కన ఎవరైనా అమ్మాయిలు పడ్డారేమోనని ఛార్ట్ చూసుకుంటానని, అలాగే ఫ్లైట్ జర్నీలో పక్క సీటులో అమ్మాయి వస్తే బాగున్ను అని అనుకుంటానని కాని అలా ఎప్పుడూ జరగలేదని తెలిపారు.
Allari Naresh :
తనుకు 7వతరగతి నుండి ఇన్ఫ్యాచుయేషన్ స్టార్ అయ్యిందని ఆయన చెప్పారు. తన స్కూల్ శ్వేత అనే మలయాళీ అమ్మాయి ఉండేదని, తన హెయిర్‌స్టైల్ బాగుంతుందని, అలాగే తను స్కూల్‌లో లీడర్ అని ఆయన చెప్పుకొచ్చారు. తను మాత్రం అన్ని విషయాల్లో లాస్ట్ ఉండేవాడినని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆ అమ్మాయి తనకు ఫస్ట్ క్రష్ అని, కాకపోతే ఎప్పుడూ ప్రపోజ్ చెయ్యలేదని నరేశ్ అన్నారు. అమ్మాయి నో చెబితే తట్టుకోలేమోననే భయంతోనే ప్రపోజ్ చెయ్యలేదని తెలిపారు.