Aliya Bhatt : సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా పండుగల వేళ మాత్రం సినీ తారలంతా తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా గడుపుతారు. షూటింగ్ సమయాల్లో వారు ఎదుర్కొనే స్ట్రెస్ ను అంతా కూడా ఇలాంటి సమయంలో వారు మరిచిపోతారు. మరీ ముఖ్యంగా నార్త్ లో నవరాత్రి సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. తొమ్మిది రోజులు కూడా వారి ఇంటి సభ్యులతో ఉంటూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతుంటారు . దసరా రోజు మరో లెవెల్ లో ఉంటుంది వీరి సందడి.

Aliya Bhatt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, రన్బీర్ కపూర్ లు కూడా ఈ దసరా సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో గడిపారు. పెళ్లయిన తరువాత వచ్చిన మొదటి దసరా కావడం తో పండుగ వేల ఆనందంగా గడిపారు. దసరా సెలబ్రేషన్స్ కు సంబందించిన పిక్స్ ను ఆలియా తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

త్వరలో తల్లి కాబోతున్న అలియా భట్ , రన్బీర్ కపూర్ లు ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఫోటోలు చూపిస్తున్నాయి. దసరా వేడుకల్లో భాగంగా కపూర్స్ ఫ్యామిలీ , భట్ ఫ్యామిలీ కలిసికట్టుగా దసరా వేడుకలను ప్రేమతో, చిరునవ్వులతో , ముచ్చట్లతో జరుపుకున్నారు.

ఆలియా భట్, రన్బీర్ కపూర్ లు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ధరించి కలర్ ఫుల్ గా కనిపించారు. ఆలియా బ్రైట్ ఎల్లో సల్వార్ సూట్ వేసుకోగా, రన్బీర్ కపూర్ లైట్ పింక్ కుర్తా సెట్ ను ధరించాడు. వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అనిపించింది. ఇక రన్బీర్ కపూర్ కుర్చీలో కూర్చుని తన ఒడిలో ఆలియా భట్ ను కూర్చోబెట్టుకొని ప్రేమతో ముద్దు పెట్టే పిక్ ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది.

ఇక మరో పిక్ లో ఆలియా భట్, రన్బీర్ కపూర్ లు దుర్గాదేవిని ఆరాధిస్తున్నట్లుగా ఉంది. ఫోటోగ్రాఫర్ తీసిన ఈ క్యాండిడ్ పిక్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.

ఫ్రెండ్స్ లేకపోతే ఆలియా భట్ తన సెలబ్రేషన్స్ ఇన్ కంప్లీట్ గా ఫీల్ అవుతుంది. అందుకే తన ఫ్రెండ్స్ ని కూడా దసరా వేడుకల్లో భాగం చేసింది. వారితో దిగిన పిక్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.

అలియా భట్ తన అమ్మ సోనీ , నాన్న మహేష్ భట్ సిస్టర్స్ పూజ, షహీన్ లతో కలిసి పిక్ దిగింది . ఆ పిక్చర్ ని కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక చివరగా ఆలియా భట్ తన భర్త కుటుంబ సభ్యులతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటో దిగి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
