Alia Bhatt: బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరున్న జంట ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లు. ఈ జంట ఏప్రిల్ 14, 2022న ఘనంగా పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తూ వస్తున్న ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో ఏడడుగులు వేశారు. అయితే వీరిద్దరికి తాజాగా ఓ పాప పుట్టినట్లు ఆలియా భట్ అధికారికంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.
ఎంతో క్యూట్ కపుల్ అయినా ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ జంటకు పుట్టిన ప్రతి విషయం మీద జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. పాప ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాకపోయినా.. ఆ పాపకు ఏం పేరు పెట్టారని చాలామంది గూగుల్ లో వెతుకుతున్నారు. దీంతో గతంలో ఆలియా ఓ పేరు గురించి ప్రస్తావించగా.. ఇప్పుడు అది ట్రెండ్ అవుతోంది.
ఆలియా భట్ కానీ, రణ్ బీర్ కపూర్ కానీ అధికారికంగా తమ కూతురు పేరును వెల్లడించకపోయినా.. వారి కూతురు పేరు ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పేరు వైరల్ అవుతోంది. గతంలో ఓ రియాలిటీ షోకు హాజరైన ఆలియా భట్.. ఓ చిన్న అబ్బాయిని తన పేరు అడుగుతుంది. దానికి ఆ చిన్నాలి ఆల్మా అని చెబితే.. ఆలియా స్పెల్లింగ్ అడుగుతుంది. దానికి ఆ చిన్నారి ALMAA అని సమాధాం ఇవ్వగా.. ఎంతో అందంగా ఉంది నీ పేరు, నా కూతురికి అదే పేరు పెడతా అని ఆలియా చెప్పింది.
Alia Bhatt:
దీంతో ఆలియా భట్ ఇప్పుడు తన కూతురికి ఆల్మా అని పేరు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై కపూర్ ఫ్యామిలీ కానీ భట్ ఫ్యామిలీ కానీ క్లారిటీ ఇవ్వాలి. ఈ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆలియా భట్ చేరగా.. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా దర్శకధీరుడు తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆలియా భట్ ‘సీత’ క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.