Ali : టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ జనసేనలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన.. జనసేనలో చేరడం ఖాయమనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. వైసీపీలో అలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. ప్రభుత్వంలో కూడా ఆయనకు ఎలాంటి పదవి లేదు. రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. సీఎం జగన్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడటంతో అలీకి రాజ్యసభ పదవి కన్ఫార్మ్ అని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కాని అలీ కి పదవి దక్కలేదు. నామినేటెడ్ పదవి కూడా ఎాలాంటిది ఇవ్వలేదు.
అలీ ముస్లిం సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆ పదవి కూడా దక్కలేదు దీంతో గత కొంతకాలంగా ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రానున్న ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ పార్టీ తరపున రాజమండ్రి అసెుంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
Ali :
వైసీపీ నుంచి గుంటూరు లేదా రాజమండ్రి సీటును అలీ ఆశిస్తున్నారు. కానీ సీటు ఇచ్చే ఛాన్స్ కూడా లేదట. దీంతో ఇక జనసేనలో చేరుతారనే ఊహాగనాలు వినిపిస్త్ున్నాయి. ఈ క్రమంలో దీనదిపై వైసీపీ వర్గాలు ప్రకటన చేశాయి. అలీ వైసీపీలోనే ఉంటారని, ఆయన పదవిలు ఆశించి పార్టీలో చేరలేదని అలీ పేరిట వైసీపీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. మరోసారి జగన్ ను సీఎం చేయడానికి కృషి చేస్తానంటూ అలీ తెలిపారు. మైనార్టీలకు సీఎం జగన్ చాలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని అందుల పేర్కొన్నారు. పదవుల కోసం తాను తాపత్రయ పడనని అలీ పేరు మీద వైసీపీ నుంచి ప్రకటన రావడంతో.. ఇక ఆయన జనసేనలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చినట్లు అయింది.