Akshara Singh : సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు, వారి వ్యక్తిగత జీవితాల మీద సామాన్యులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలు, అభిమానుల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. అయితే సోషల్ మీడియా వల్ల లాభం ఎంతుందో.. నష్టం కూడా అంతే ఉంది. ఇది ఎన్నో సార్లు రుజువైంది కూడా. మరీ ముఖ్యంగా కేటుగాళ్లు కొందరు సాంకేతికతను తప్పుడు పనుల కోసం వినియోగిస్తూ.. ఇతరుల పరువు, మర్యాద మంటగలిపే పనులు చేస్తుంటారు. ఇలాంటి బాధితుల్లో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండటం లేదు.
తాజాగా ఓ హీరోయిన్, బిగ్‌బాస్ ముద్దుగుమ్మకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. భోజ్‌పురి బిగ్‌బాస్ ద్వారా ఫేమస్ అయ్యి.. ప్రస్తుతం హీరోయిన్‌గా మారిన అక్షరా సింగ్ పర్సనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. వీడియోలో ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అక్షరాసింగ్ పెదవి విప్పింది. ఆ వీడియో తనది కాదని.. తన మీద కోపంతో ఎవరో మార్ఫింగ్ చేశారని వెల్లడించింది. తనది కానీ వీడియో గురించి తాను ఎందుకు బాధపడాలని ప్రశ్నించింది.
Akshara Singh : ఇలాంటి పనులు నన్ను బాధించలేవు.. భయపెట్టలేవు
ఈ సందర్భంగా అక్షరా సింగ్ మాట్లాడుతూ.. ‘‘నా ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది అని తెలిసింది. కానీ అది నా వీడియో కాదు. ఎవరో కావాలనే నా ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కొందరు నన్ను ట్రోల్ చేస్తూ.. విమర్శిస్తున్నారు. కానీ నాది కానీ వీడియో గురించి నేను ఎందుకు బాధపడాలి.. భయపడాలి. అసలు ఆ వీడియోను నేను చూడలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. నా మీద కోపంతో ఎవరో ఇలాంటి పనులు చేసి ఉంటారు. కానీ ఇలాంటి పనులు నన్ను బాధించలేవు.. భయపెట్టలేవు’’ అని పేర్కొంది. ఆమె రియాక్షన్‌పై కొందరు నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు.