Akshara Singh: హిందీ ప్రేక్షకులకు భోజ్ పురి నటి అక్షర సింగ్ అందరికీ సుపరిచితురాలే. సినిమా మరియు సీరియల్స్ ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అక్షర సింగ్ గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తితో గదిలో అశ్లీలంగా కనిపించిన అక్షర సింగ్ బోల్డ్ ఎస్ఎంఎస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అక్షర సింగ్ వీడియోపై చాలామంది నెటిజన్ లు ఘాటైన విమర్శలు చేయడం జరిగింది.
సెలబ్రిటీ అయుండి ఇటువంటి పనులు చేయడానికి సిగ్గు లేదా అంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియో బాగా వైరల్ కావటంతో పాటు కాంట్రవర్సీ అవుతూ ఉండటంతో తాజాగా అక్షర సింగ్.. వీడియో పై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ఆ వీడియో తనకి సంబంధించింది కాదని స్పష్టం చేసింది. ఆ వీడియోలో ఉన్న ఆమె ఎవరో కూడా నాకు తెలియదు.
ఎవరో నా ఫోటోలు మార్ఫింగ్ చేశారు. అయితే ఆ పని ఎవరు చేశారు అన్నది నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. అయినా గాని ఇప్పటివరకు ఆ వీడియో గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ వీడియో చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. కావాలని ఎవరో నా మీద కోపంతో ఇటువంటి పిచ్చి పనులు చేశారని.. ఇటువంటి చిల్లర పనులు పట్టించుకోను అని అక్షర సింగ్ క్లారిటీ ఇచ్చింది.