టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మరో వైపు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీటి సంగతి మామూలే. వీటితో పాటు నాగార్జున బయట చాలా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో నుంచి, ఫిల్మ్ స్కూల్, అలాగే ఇతర వ్యాపార సంబంధ లావాదేవీలు అన్ని కూడా నాగార్జున చూసుకుంటారు. ఇండస్ట్రీలో నాగార్జునని మంచి వ్యాపారవేత్త అని అంటూ ఉంటారు. అలాగే కింగ్ నాగార్జున రాజకీయాలకి దూరంగా ఉంటూ అధికారంలో ఎవరు ఉంటే వారితో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఇలా ఉంటూ తన వ్యాపార లావాదేవీలు సజావుగా సాగేలా చేసుకుంటారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నాగార్జునకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
నాగార్జున మేనల్లుడు సుమంత్, జగన్ క్లాస్ మేట్స్, అలాగే మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి అక్కినేని కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. చాలా సందర్భాలలో నాగార్జున, వైఎస్ జగన్ కలవడం కూడా జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో ఒక హాట్ న్యూస్ రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ నుంచి నాగార్జున వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తాడని టాక్ నడుస్తుంది. జగన్ ఇప్పటికే నాగార్జునకి దీనిపై హామీ కూడా ఇచ్చారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
అయితే అక్కినేని నాగేశ్వరరావు కాలం నుంచి ఆ ఫ్యామిలీ రాజకీయాలకి దూరంగానే ఉంటున్నారు. చాలా సందర్భాలలో అవకాశం వచ్చిన కూడా అటుగా అడుగుపెట్టే ప్రయత్నం చేయలేదు. అలాంటిది ఇప్పుడు నాగార్జున ఎందుకు వెళ్తాడు అనే మాట కూడా వినిపిస్తుంది. అలాగే నాగార్జునకి రాజకీయాలపై బొత్తిగా ఆసక్తి లేదనే మాట కూడా అభిమానులు అంటున్నారు. అదంతా కేవలం వైసీపీ చేస్తున్న ప్రచారం మాత్రమేనని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే అయితే నాగార్జున వెళ్లనున్న అక్కినేని ఫ్యామిలీ నుంచి వైసీపీ తరుపున ఎవరో ఒకరు ఈసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందనే మాట గట్టిగా వినిపిస్తుంది.