Samantha : స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం వార్త నిన్న ఒక్కసారిగా గుప్పుమనడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె కోలుకోవాలని.. ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో సామ్ అనారోగ్యంపై రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ఆమె స్కిన్ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతోందని రూమర్స్ చెలరేగాయి. దీనికి సామ్ అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలి కాలంలో సామ్ సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండిపోయింది.
అయితే సామ్ తన గురించి వస్తున్న రూమర్స్‌కి సమాధానం చెప్పలేకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటోందని సైతం ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ నిన్న సామ్ ఓవైపు చికిత్స తీసుకుంటూనే, మరోవైపు యశోద సినిమాకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటోను సమంత సోషల్ మీడియాలో చేసింది. తన అనారోగ్యం గురించి ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అటు అభిమానులు.. ఇటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇక సామ్ అనారోగ్యంపై తాజాగా అక్కినేని అఖిల్ తాజాగా స్పందించాడు. ‘అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్’ అంటూ అఖిల్ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు మరి నాగ చైతన్య ఇంకా ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. సామ్ అనారోగ్యం వార్తలు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కాబట్టి అతనికి తెలియదు అనుకోవడానికి కూడా లేదు. పైగా ఆమెతో విడిపోయిన తర్వాత ఏనాడు కూడా సామ్ గురించి చై మాట తూలింది లేదు. ఆమె ఎప్పటికీ తన స్నేహితురాలే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అలాంటి చై సామ్ అనారోగ్యంపై స్పందిస్తాడా.. లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.