బోయపాటి శీను దర్శకత్వంలో ముచ్చటగా మూడవసారి బాలయ్య చేసిన మూవీ అఖండ.ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించి అలరించిన బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా నటించారు.తాజాగా బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతూ సరికొత్త రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుంది.
అయితే గత కొంతకాలంగా సౌత్ లో సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేస్తున్న బాలీవుడ్ ప్రముఖులు తాజాగా అఖండ మూవీ హిందీ రీమేక్ రైట్స్ ను 20 కోట్లకు కొనుగోలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.